కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే ఇలా
Actor ProfilePolitician

కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే ఇలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే ఇలా
Andhra Jyothy7 Jan 2027
కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే ఇలా

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నేటినుంచి అమల్లోకి సర్వం సిద్ధం చేసిన ట్రాఫిక్‌ పోలీసులు 13 చోట్ల ఎగ్జిట్‌ పాయింట్లు అదనంగా 35 సీసీ కెమెరాల ఏర్పాటు పాదచారుల కోసం ‘సిటిజన్‌ పెవిలియన్లు’.. ప్రత్యేక జీబ్రా క్రాసింగ్స్‌ నాలుగు షిఫ్టుల్లో సిబ్బంది పహారా.. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ హైదరాబాద్: అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిధిలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నేటినుంచి ‘వన్‌ వే’ అమలు కానుంది. ఈ మేరకు పోలీస్‌ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ట్రాఫిక్‌ కష్టాలకు చరమగీతం పాడేలా అమలు చేయనున్న వన్‌వే ప్రయాణతీరుపై వాహన చోదకులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రోడ్డులో ఎగ్జిట్‌ పాయింట్స్‌, లైన్‌ చేంజింగ్‌ పై అవగాహన ఉంటే సాఫీగా ప్రయాణం చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. గతంలో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ను పరిగణలోకి తీసుకొని సమస్యలను అధిగమించేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. లేన్‌ 1.. 2 రోడ్ల వర్గీకరణ హెచ్‌-సిటీ ప్రణాళికలో భాగంగా వాహనాలు ఎక్కడా నిలవకుండా సాఫీగా సాగేందుకు రహదారులను రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు. లేన్‌-1 : దూరం వెళ్లే వాహనాలు, నాన్‌-స్టా్‌పగా ప్రయాణించే వారి కోసం ప్రత్యేకించారు. లేన్‌- 2: కాలనీలు, ఉప రహదారుల్లోకి వెళ్లే వారి కోసం నిర్దేశించారు. పది ప్రాంతాల్లో లేన్‌ చేంజింగ్‌కు అవకాశం కల్పించారు. 13చోట్ల ఎగ్జిట్‌ పాయింట్లు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా వెళ్లేందుకు వీలుగా కేబీఆర్‌ చుట్టూ 13చోట్ల ఎగ్జిట్‌ పాయింట్లను శాస్త్రీయంగా తీర్చిదిద్దారు. కేబీఆర్‌ పార్కుకు నిత్యం వేలాది మంది వాకర్లు, పర్యాటకులు వస్తుంటారు. వీరికి ఇబ్బందులు రాకుండా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్డు దాటాలనుకునే పాదచారులు సురక్షితంగా వేచి ఉండేందుకు పలు కీలక కూడళ్లలో అత్యాధునిక ‘సిటిజన్‌ పెవిలియన్స్‌’ నిర్మించారు. అవకాశమున్న చోట్ల స్పష్టమైన జీబ్రాక్రాసింగ్స్‌, ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు బ్లింకర్లు, రేడియం సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అదనంగా 35 సీసీ కెమెరాలు కేబీఆర్‌

క బ ఆర ప ర క వద ద వన వ ఇల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in