
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్-వే నిబంధనలతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ ఆరీస్టీ చర్యలు చేపట్టింది. 47ఎల్, 127కే, 10హెచ్ బస్సుల రూట్లను వెల్లడించిన ఆర్టీసీ హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్-వే నిబంధనలతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ ఆరీస్టీ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్సు రూట్లలో మార్పులు చేస్తూ, స్టాప్‌లు, స్టేజీల వివరాలను అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మారిన బస్సు రూట్లు, స్టాప్‌ల ఆధారంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడిపించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మణికొండ : సికింద్రాబాద్- బేగంపేట- నాగార్జున సర్కిల్ - ఎల్‌వీ ప్రసాద్- బసవతారకం హాస్పిటల్- బీఆర్‌ఎస్ భవన్- ఎమ్మెల్యే కాలనీ- ఒమేగా- అపోలో ఆస్పత్రి- ఫిల్మ్‌నగర్- దర్గా- మణికొండ మణికొండ నుంచి సికింద్రాబాద్: మణికొండ- పంచవటికాలనీ, దర్గా- ఫిల్మ్‌నగర్ - జర్నలిస్ట్ కాలనీ- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్- అన్నపూర్ణ స్టూడియో- ఎల్‌వీ ప్రసాద్ హాస్పిటల్- టీవీ9 (మసీద్)- పంజాగుట్ట పీఎస్- ఆర్‌జే కాలేజీ- పోలీస్ లైన్- ప్లాజా- సికింద్రాబాద్. కోఠి నుంచి పటాన్‌చెరు: కోఠి- లక్డీకాపూల్- మాసబ్‌ట్యాంక్- నాగార్జున సర్కిల్- ఎల్‌వీ ప్రసాద్- బసవతారకం హాస్పిటల్- బీఆర్‌ఎస్ భవన్- ఎమ్మెల్యే కాలనీ-ఒమేగా- ఆపోలో ఆస్పత్రి- జర్నలిస్ట్ కాలనీ- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్- పెద్దమ్మగుడి - మాదాపూర్ పీఎస్- పటాన్ చెరు. పటాన్‌చెరు నుంచి కోఠి: పటాన్‌చెరు- మాదాపూర్ పీఎస్- పెద్దమ్మగుడి- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్- అన్నపూర్ణ స్టూడియో- ఎల్‌వీ ప్రసాద్- నాగార్జున సర్కిల్- మాసబ్‌ట్యాంక్ - లక్డీకాపూల్- కోఠి కోఠి నుంచి కొండాపూర్ : కోఠి- లక్డీకాకపూల్ - మాసబ్‌ట్యాంక్- పెన్షన్ ఆఫీస్ - ఎమ్మెల్యే కాలనీ- అపోలో ఆస్పత్రి- రోడ్డు నంబర్