
పేదరిక నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 'పీ4' (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ ప్రాస్పెరిటీ) కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒకవైపు పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూనే, మరోవైపు రైతుల ఆదాయాన్ని పెంచేలా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తన కుప్పం పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా 'బంగారు కుటుంబాలు', 'మార్గదర్శుల'తో సమావేశమవగా, అనంతరం రైతులతో ఆత్మీయ పలకరింపులో మాట్లాడారు.పేదరికంపై పీ4 అస్త్రంపేదల జీవితాలను బంగారు మయం చేయాలనే లక్ష్యంతోనే పీ4 విధానాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన 'బంగారు కుటుంబాల' ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మెగా, అదానీ, టీవీఎస్ మోటార్స్ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. "బంగారు కుటుంబాలు కేవలం ప్రభుత్వ సాయంపై ఆధారపడకూడదు. ఆర్థికంగా ఎదిగి ఇతరులకు సాయం చేసే స్థాయికి చేరుకోవాలి. ఇందుకోసం మార్గదర్శులు, బంగారు మిత్రలు ప్రతి కుటుంబాన్ని అధ్యయనం చేసి, వారి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలి," అని సీఎం సూచించారు.సమాజంలోని ఉన్నత వర్గాల్లోని 10 శాతం మంది, పేదరికంలో ఉన్న 20 శాతం కుటుంబాలకు అండగా నిలవాలనే 'ఎంబీకే–10:20' నమూనాతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించగా, వారికి చేయూతనివ్వడానికి 1.10 లక్షల మంది మార్గదర్శులు