కాన్వాయ్ ఆపి.. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన సీఎం చంద్రబాబు
Actor ProfilePolitician

కాన్వాయ్ ఆపి.. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన సీఎం చంద్రబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కాన్వాయ్ ఆపి.. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన సీఎం చంద్రబాబు
AP7AM21 Nov 2026
కాన్వాయ్ ఆపి.. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ (ఆగస్టు 9) విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి వెళుతున్న సమయంలో, మార్గమధ్యంలో తన కాన్వాయ్‌ను బ్యారేజీపై కొద్దిసేపు నిలిపివేశారు. బ్యారేజీ వద్ద నీటి లభ్యత, డెల్టాకు నీటి విడుదల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను విజయవంతంగా కృష్ణా నదికి తరలించినట్లు జలవనరుల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా ఇదే సీజన్‌లో సుమారు 521 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా కలిసిపోయిందని తెలిపారు.పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సమృద్ధిగా కృష్ణా నదికి చేరుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటి యాజమాన్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టాలోని వివిధ కాలువలకు మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 3,115 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్‌కు 115 క్యూసెక్కుల చొప్పున నీటిని అందిస్తున్నట్లు వారు ముఖ్యమంత్రికి నివేదించారు

క న వ య ఆప ప రక శ బ య ర జ న పర శ ల చ న స ఎ చ ద రబ బ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in