SSY Calculator : మీరు పెట్టుబడులు పెడుతున్నారా? మరి ఇంతకీ ఎలాంటి స్కీమ్స్ ఎంచుకుంటున్నారు. ఏ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? మన కోసం స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, గోల్డ్, పోస్టాఫీస్ పథకాలు , ఇంకా ఆర్బీఐ స్కీమ్స్ చాలానే ఉన్నాయి. వీటిల్లో ఏది ఎంచుకుంటున్నారనేదే ముఖ్యం. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ రిస్క్‌తో కూడుకున్నవి. గోల్డ్, రియల్ ఎస్టేట్ అనిశ్చితికి లోబడి ఉంటాయి. మరీ ఎక్కువ రాబడి ఊహించలేం. బ్యాంక్ ఎఫ్‌డీ, రికరింగ్ డిపాజిట్లు వంటివి ఉన్నప్పటికీ ఇక్కడ వడ్డీ రేట్లు మరీ ఎక్కువగా ఏం ఉండవని చెప్పొచ్చు. కానీ రిస్క్ ఉండదు. ఇక అత్యంత సురక్షితమైన వాటిల్లో కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాలు (పోస్టాఫీస్ పథకాలు), ఆర్బీఐ బాండ్లు వంటివి కాస్త ఆకర్షణీయంగా ఉంటాయి.ఇక్కడ మనం ఇప్పుడు ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల గురించి చూద్దాం. ఇందులో ఆడపిల్లల కోసం కేంద్రం అందిస్తున్న అద్భుతమైన స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం. చాలా మంది ఈ పథకంలో పెట్టుబడులు పెడుతుంటారు. కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి ఈ పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. ఇటీవల జులై- సెప్టెంబర్ త్రైమాసికం వడ్డీ రేట్లను ప్రకటించినా ఏం మార్చకుండా మరోసారి యథాతథంగానే ఉంచింది.దీంతో ఇప్పుడు సుకన్య సమృద్ధి పథకంలో వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 8.20 శాతం వద్దే యథాతథంగా కొనసాగుతోంది. ఈ పథకాల్లో సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌తో కలిసి దీంట్లోనే వడ్డీ రేటు అధికంగా ఉంది. ఈ స్కీమ్ వివరాల్ని ఇప్పుడు చూద్దాం.సుకన్య సమృద్ధి పథకం వివరాలు ఇది కేవలం ఆడపిల్లల కోసమే అందుబాటులో ఉన్న స్కీమ్. పాప పదేళ్లలోపు వయసులోనే ఇందులో చేరాలి. వరుసగా 15 ఏళ్లు డబ్బుల్ని జమ చేస్తూ పోవాలి. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి
Actor ProfilePolitician
కేంద్రం సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లను మార్చిందా? ఒకేసారి ఇలా చేతికి రూ. 69 లక్షలు.. నెలకు ఎంత
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•25 Sept 2026
కేంద్రం సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లను మార్చిందా? ఒకేసారి ఇలా చేతికి రూ. 69 లక్షలు.. నెలకు ఎంత