
మదనపల్లె గ్రామీణం: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్ ఎదుట జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీసం వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు జనార్ధన్, శ్రీనివాసులు, కృష్ణప్ప, హరి శర్మ, మధురవాణి తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు