కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత స్కీమ్.. 18 ఏళ్లు దాటితే చాలు.. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు
Actor ProfilePolitician

కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత స్కీమ్.. 18 ఏళ్లు దాటితే చాలు.. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత స్కీమ్.. 18 ఏళ్లు దాటితే చాలు.. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు
TV9 Telugu29 Dec 2026
కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత స్కీమ్.. 18 ఏళ్లు దాటితే చాలు.. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు

పోస్టాఫీస్ అనేక పొదుపు పథకాలను తీసుకొచ్చింది. వాటిల్లో ఒకటి కిసాన్ వికాస్ పత్ర ఒకటి. దీనిని పోస్టాఫీస్ కేవీపీగా పిలుస్తారు. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బులు సురక్షితంగా ఉండటంతో పాటు మీ నగదుకు కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. దీంతో మీ డబ్బులు పూర్తి భద్రంగా ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాకుండా మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకంలో పొందవచ్చు. ఈ పథకంలో కేవలం రూ.వెయ్యి నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతవరకు అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితిపై ఎలాంటి నిబంధనలు లేవు. ఈ పథకంలో చేరాలంటే వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. మీ సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.5 శాతం ఉంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఈ పథకం ఎక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు. 2 సంవత్సరాల 6 నెలల తర్వాత మీకు అవసరమైతే నిధులును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడిన పెడితే 9 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. మీరు ఉదాహరణకు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 115 నెలల్లో రూ.10 లక్షలు అవుతుంది. ఇక రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే అది రూ.20 లక్షలు అవుతుంది. ఇది స్టాక్ మార్కెట్‌తో లింక్ అయి ఉండడు. అసలు స్టాక్ మార్కెట్ల అంచనాలతో ప్రభావితం అవ్వదు. దీంతో మీరు ఎలాంటి రిస్క్ లేకుండా మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడనివారికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు. పోస్టాఫీసులో బాగా పాపులర్ అయిన పథకాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు. దీంతో చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉండటంతో డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి మార్గంగా చెప్పవచ్చు. ఆధార్, పాన్ సమర్పించి ఈ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది

క ద ర ప రభ త వ న చ అద భ త స క మ 18 ఏళ ల ద ట త చ ల ఎక కడ న అప ల చ స క వచ చ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in