కేంద్ర కేబినెట్లోకి కొత్త ముఖాలు..! రేసులో బీజేపీ సీఎం ?
Actor ProfilePolitician

కేంద్ర కేబినెట్లోకి కొత్త ముఖాలు..! రేసులో బీజేపీ సీఎం ?

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేంద్ర కేబినెట్లోకి కొత్త ముఖాలు..! రేసులో బీజేపీ సీఎం ? -అప్డేట్ ఇదే
Oneindia Telugu9 Jan 2027
కేంద్ర కేబినెట్లోకి కొత్త ముఖాలు..! రేసులో బీజేపీ సీఎం ? -అప్డేట్ ఇదే

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ ప్రక్షాళనకు (Union Cabinet Reshuffle) సిద్దమైన ప్రధాని మోడీకి ఆ అవకాశం లభించలేదు. దీనికి బిజీ షెడ్యూల్ తో పాటు మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాల తర్వాత కేబినెట్ ప్రక్షాళన వాయిదా పడింది. అయితే ఊహించిన విధంగానే ఇప్పుడు కేబినెట్ మార్పులకు పావులు కదులుతున్నాయి. కానీ పార్లమెంట్ సమావేశాలకు ముందు అనుకున్న మార్పులే కాదు, అనుకోని మార్పులు కూడా ఇందులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!కాక్రోచ్ ఉద్యమం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, పీయూష్ గోయల్ కు బీజేపీలో కోశాధికారి పదవి, అంతకు ముందే మరో ఇద్దరు కేంద్రమంత్రులు రవ్ నీత్ బిట్టూ, జార్జి కురియన్ ల రాజీనామాలు.. ఇలా ఈ మధ్య కాలంలో చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా పలువురు కేంద్రమంత్రులకు రాష్ట్రాల ఇన్ చార్జ్ బాధ్యతలు కూడా దక్కాయి. దీంతో ఇప్పుడు కేబినెట్ ప్రక్షాళన మరింత ఉత్కంఠ భరింతంగా మారింది. Cabinet Reshuffle: మోడీ కేబినెట్ విస్తరణ ఖరారు..! కేంద్రమంత్రి హింట్..! గోయల్ అవుట్?ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కు కూడా అవకాశం దక్కబోతోందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దీంతో ఉద్ధవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ ప్రచారాన్ని మరోమారు ముమ్మరం చేశారు. దీంతో ఫడ్నవీస్ స్పందించక తప్పలేదు. తాను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఇలాంటి ఊహాగానాలు మొదలవుతాయని, కానీ వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యత మేరకు మహారాష్ట్రలోనే ఉన్నానని, ఇకపైనా ఇక్కడే ఉంటానని ఫడ్నవీస్ తేల్చేశారు.మరోవైపు కేంద్రమంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు స్ధాన చలనం తప్పదని