
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల ముందు ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతామని మాయమాటలు చెప్పి.. వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇప్పుడు వారి కష్టాలను గాలికొదిలేశారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ పరీక్ష భారం నుంచి బయటపడేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిల గురుమూర్తి, గొల్ల బాబూరావు నేతృత్వంలో టీచర్ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలిశారు. టెట్ పరీక్ష ఉత్తీర్ణత కావడం తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని వారు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుంటోందని మండిపడ్డారు. కేంద్రంలో తమ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని గొప్పలు చెప్పుకునే వెన్నుపోటు పార్టీ నేతలు, టీచర్లను ఆదుకునేందుకు 'విద్యా హక్కు చట్టాన్ని' ఎందుకు సవరించలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు వయసు దాటిన టీచర్లను ఉన్నట్టుండి ఇప్పుడు ఆన్‌లైన్‌లో అన్ని సబ్జెక్టులూ పరీక్ష రాయమనడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కనీసం రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో, ఉపాధ్యాయుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడిందని చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి టీచర్ల ఆవేదనను వివరించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే, ఉపాధ్యాయ లోకం తరపున చట్టసభల్లోనూ, న్యాయస్థానాల్లోనూ వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. వారు ఇంకా ఏం మాట్లాడారంటే.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదు?: గొల్ల బాబూరావు కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని, తమ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే కూటమి నేతలు.. మరి ఉపాధ్యాయులను ఈ 'టెట్' భారం నుంచి ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో సుమారు