కూతురి కోసం తండ్రి ఆరాటం
Actor ProfileActor

కూతురి కోసం తండ్రి ఆరాటం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కూతురి కోసం తండ్రి ఆరాటం, అసలు కథ ఇదే, ఇరుముడి ట్రైలర్ ఎలా ఉందంటే
Asianet News Telugu11 Dec 2026
కూతురి కోసం తండ్రి ఆరాటం, అసలు కథ ఇదే, ఇరుముడి ట్రైలర్ ఎలా ఉందంటే

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ `ఇరుముడి`. అయ్యప్పస్వామి భక్తుడి కథా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం ఈ నెల 21న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. పూర్తిగా ఇది శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ తో, ఇంటెన్సిటీతో సాగుతుందని తెలుస్తోంది. ట్రైలర్‌ లో ఏం చూపించారనేది చూస్తే, రవితేజ కూతురు స్కూల్‌కి వెళ్తుంటుంది. ఆమెనే ప్రాణంగా బతుకుతుంటాడు రవితేజ. ఆయన ఆటో నడిపిస్తుంటాడు. ఆయన భార్య ప్రియా భవానీ శంకర్‌ నటించింది. రవితేజ ప్రతి ఏడాది అయ్యప్పస్వామి మాల ధరిస్తుంటాడు. అదే సమయంలో మాల లేనప్పుడు ఆల్కహాల్‌ బాగానే తీసుకుంటాడు. అదే ఓ సమస్యగా మారుతుంది. అయితే తన కూతురు ఐదో తరగతి పూర్తి చేసిందని చెప్పి ఫంక్షన్‌ కూడా చేస్తాడు. కానీ ఆ తర్వాత ఆడపిల్లలకు ఆ ఊర్లో భద్రత లేదు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు కొందరు దుండగులు. వారి నుంచి రవితేజ కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. తన ఒక్క కూతురునే కాదు, ఊర్లో అందరు ఆడపిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటాడు. మరి ఈ క్రమంలో చోటు చేసుకునే ఆసక్తికర సంఘటనల సమాహారమే ఈ సినిమా అని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. మాల వేసినప్పుడు పద్ధతిగా, భక్తితో ఉండే రవితేజ మాల తీస్తే మాత్రం శత్రువులకు యముడిగా మారిపోతుంటాడు. అయితే తండ్రిని చూసి ఓ దశలో కూతురు కూడా భయపడుతుంది. ఇలాంటి ఎమోషనల్‌ అంశాలు, యాక్షన్‌ అంశాలు, సెంటిమెంట్‌, ఫ్యామిలీ అంశాల మేళవింపుతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు శివ నిర్వాణ. రవితేజ ఇటీవల నటిస్తున్న సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఓ వైపు భక్తిరస చిత్రంగా, మరోవైపు కూతురుని కాపాడుకోవడం కోసం తండ్రి పడే ఆరాటం, పోరాటం ప్రధానంగా సినిమా సాగుతుంది. ట్రైలర్‌ మాత్రం ఆకట్టుకుంటోంది

క త ర క స త డ ర ఆర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in