కొత్త పార్టీ పెడుతున్నా.. తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
Actor ProfilePolitician

కొత్త పార్టీ పెడుతున్నా.. తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త పార్టీ పెడుతున్నా.. తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
AP7AM14 Jan 2027
కొత్త పార్టీ పెడుతున్నా.. తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన

మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తన రాజకీయ పునః ప్రవేశంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించారు. వైసీపీలోకి తిరిగి వెళ్తారంటూ జోరుగా సాగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ, సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కొత్త పార్టీకి శ్రీవారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయి రెడ్డి వివరించారు. ప్రజల పక్షాన బలమైన గొంతుకను వినిపించేందుకే కొత్త పార్టీ పెడుతున్నానని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు, భవిష్యత్ కార్యాచరణను ఈ నెలలోనే విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానని తెలిపారు. దేశం ఎల్‌నినో ప్రభావం లేకుండా సుభిక్షంగా ఉండాలని కూడా స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.గతేడాది తన రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని నెలలకే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజకీయాల్లోకి తిరిగి వస్తానని, సొంతంగా ఒక మీడియా సంస్థను కూడా ప్రారంభిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పలు జాతీయ, రాష్ట్ర అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.ఇటీవల కాలంలో ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందిస్తూ.. తనది స్వతంత్ర