కొత్త పింఛన్ల పండగ
Actor ProfilePolitician

కొత్త పింఛన్ల పండగ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త పింఛన్ల పండగ
Andhra Jyothy9 Jan 2027
కొత్త పింఛన్ల పండగ

ఏడు రకాల పింఛన్లకే చేయూత దరఖాస్తుల స్వీకరణ ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న వృద్ధాప్య పింఛన్లకు లభించని అనుమతి 3,692 మంది వృద్ధుల దరఖాస్తులకు మొండిచేయి హనుమకొండ: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నూతన చేయూత పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించి, అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కు శ్రీకారం చుట్టింది. అయితే ఈ నిర్ణయం ఏళ్ల తరబడి పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న వేలా దిమంది వయోవృద్ధులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఏడు రకాల పింఛన్లకు మాత్రమే దరఖా స్తులు స్వీకరిస్తుండగా, వృద్ధాప్య పింఛన్లను ఈ జాబితాలో చేర్చకపోవడంతో వృద్ధుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి ఎదురుచూపులు గతంలో వృద్ధాప్య పింఛను వయోపరిమితిని తగ్గించినప్పటికీ అనేక మంది అర్హులకు అవకాశం దక్కలేదు. ఆన్‌లైన ఐడీలు ఓపెన్‌ కాకపోవడంతో జిల్లావ్యాప్తంగా వేలాది మంది అర్హులైన వృద్ధులు అప్లై చేసుకోలేకపోయారు. ప్రభుత్వం మారిన తర్వాతైనా తమకు అవకాశం వస్తుందని భావించిన వయోవృద్ధులకు ప్రస్తుతం మళ్లీ కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. ఏడు రకాల వారికే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మొదటి విడతగా ఏడు కేటగిరీల వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం క ల్పించారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, పైలేరియా, తలసేమియా, డయాలసిస్‌ వ్యాధిగ్రస్తులకు మాత్రమే ప్రాధాన్యం కల్పించారు. కొత్త పింఛన్ల దరఖాస్తుకు రకరకాల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి చేయడంతో జిల్లాలోని తహసీల్‌ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల వ ద్ద రద్దీ నెలకొంది. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పింఛను రూ.4016, వితంతు, బీడీ, చేనేత, గీత కార్మికులకు రూ.2016 ప్రతినెలా అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులకు అవకాశం కల్పించకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లా