
ఇంటిని కొనుగోలు చేసి, దానికి హోమ్ లోన్ చెల్లిస్తూ అద్దెకు ఇచ్చారా? అయితే కొత్త పన్ను విధానం వల్ల మీ పన్ను ప్రయోజనాలు ఎలా మారాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొత్త విధానంలో కొన్ని మినహాయింపులు తొలగించినా, అద్దెకు ఇచ్చిన ఆస్తిపై చెల్లించే హోమ్ లోన్ వడ్డీకి పూర్తి మినహాయింపును ప్రభుత్వం కొనసాగిస్తోంది. అయితే, పాత విధానానికి, కొత్త విధానానికి మధ్య 'నష్టాల సర్దుబాటు' విషయంలో వచ్చిన కీలక మార్పు మీ పన్ను భారంపై నేరుగా ప్రభావం చూపుతుంది.వడ్డీ మినహాయింపు కొనసాగింపు.. కానీ షరతులు వర్తిస్తాయిఆదాయపు పన్ను చట్టం ప్రకారం అద్దెకు ఇచ్చిన ఇంటి హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీకి పాత, కొత్త రెండు పన్ను విధానాల్లోనూ పూర్తి మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 24(బి) కింద దీనికి ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. దీంతో పాటు, మున్సిపల్ పన్నులు, నికర వార్షిక విలువ (ఎన్ఏవీ)పై 30 శాతం ప్రామాణిక మినహాయింపు కూడా యథాతథంగా కొనసాగుతున్నాయి.అసలు మార్పు ఇక్కడే.. నష్టాల సర్దుబాటులో తేడావడ్డీ మినహాయింపు ఉన్నప్పటికీ, అసలు మార్పు 'ఆస్తి ద్వారా వచ్చే నష్టం' విషయంలోనే ఉంది. ఉదాహరణకు, మీరు చెల్లించే హోమ్ లోన్ వడ్డీ, ఇతర మినహాయింపులు.. మీకు వచ్చే అద్దె ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే, అక్కడ నష్టం ఏర్పడుతుంది.పాత పన్ను విధానం: ఈ నష్టాన్ని (గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు) మీ జీతం, వ్యాపారం లేదా ఇతర ఆదాయాలతో సర్దుబాటు చేసుకునేందుకు వీలుండేది. ఇది పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించేది.కొత్త పన్ను విధానం