కొత్త జంట సంబరానికి టీటీఈ కొలువు పాయె
Actor ProfilePolitician

కొత్త జంట సంబరానికి టీటీఈ కొలువు పాయె

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త జంట సంబరానికి టీటీఈ కొలువు పాయె
Eenadu12 Oct 2026
కొత్త జంట సంబరానికి టీటీఈ కొలువు పాయె

దిల్లీ: ఓ రైల్లోని ఏసీ ‘కుపే’ను అలంకరించుకుని దానిలో వీడియో చిత్రీకరించుకున్న ఓ కొత్త జంట వల్ల టీటీఈపై సస్పెన్షన్‌ వేటు పడింది. బల్లార్షా నుంచి ముంబయి వెళ్లే 11002 నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఓ జంట.. ఆన్‌లైన్‌లో ఒక డెకరేటర్‌ను బుక్‌ చేసుకుని తమ ఫస్ట్‌ ఏసీ కుపేను అలంకరించుకుంది. వీరి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. విషయం రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి వెళ్లింది. డెకరేటర్‌ అనధికారికంగా రైల్లోకి రావడాన్ని తీవ్రమైన వైఫల్యంగా పరిగణించి టీటీఈని సస్పెండ్‌ చేసింది. శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు