హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా పరిగణిస్తారు. ఇదే నెలలో చాతుర్మాసం ప్రారంభం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శ్రీ మహా విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు. మరోవైపు ఇదే కాలంలో పూర్వకాలంలో కొత్తగా పెళ్లయిన జంటలు సుమారు ఆరు నెలల పాటు అత్తారింట్లో ఉండేవారు. అయితే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఈ కాలంలో వ్యవసాయ పనులన్నీ మొదలవుతాయి. అయితే కొత్త అల్లుడు తమ భార్యపై ప్రేమతో ఏ పని చేయకుండా అత్తారింట్లో కూర్చుని తినడం వల్ల పనులన్నీ ఆగిపోతాయనే ఉద్దేశ్యంతో ఈ నియమాన్ని తీసుకొచ్చారు పెద్దలు. కానీ ఇప్పటి జనరేషన్ వాళ్లు ఈ సంప్రదాయాలను పెద్దగా పాటించడం లేదు. ఈ కాలంలో గర్భిణీగా మారడం కూడా తల్లీ బిడ్డలకు అంత మంచిది కాదు. ఈ కాలంలో వర్షాలు, వరదల కారణంగా జలాశయాలు, నదులు, కాలువల్లోని నీళ్లన్నీ కలుషితమవుతాయి. దీంతో ఈ నీటిని వాడిన వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చలి జ్వరాలు, విరేచనాలు, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆషాఢ మాసంలో ప్రెగ్నెన్సీ మంచిది కాదని ఈ ఆచారాలను తీసుకొచ్చారు. అయితే కొత్త జంటలకు శారీరకంగా కొంత ఇబ్బంది కలిగినా.. టెక్నాలజీ పుణ్యమా అని మానసికంగా దగ్గరవుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు వచ్చాక వీడియో కాల్స్, ఆడియో కాల్స్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వంటి వాటి సాయంతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. దీంతో వీరి వివాహ బంధం మరింత బలోపేతం అవుతుంది. ఈ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే ఎండాకాలంలో డెలివరీ అవుతుంది. ఆ టైమ్‌లో ఉక్కపోతలు ఎక్కువగా ఉండటం, వేడిని తట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా ఎండాకాలంలో కొత్త పెళ్లికూతురికి అత్తగారింట్లో
Actor ProfileCelebrity
కొత్త జంటలకు ఆషాఢంలో ఎడబాటు ఎందుకు? దీని వెనుక ఉన్న సంప్రదాయ కారణాలేంటి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•27 Oct 2026
కొత్త జంటలకు ఆషాఢంలో ఎడబాటు ఎందుకు? దీని వెనుక ఉన్న సంప్రదాయ కారణాలేంటి