
బెంగుళూరు: ప్రేమించి వివాహం చేసుకున్న జంటపై పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే హత్యాయత్నం చేసిన సంఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా బసవాపట్టణంలో జరిగింది. కుంచుగారనహళ్లికి చెందిన సిద్ధేశ్ (22)ని యువతి కుటుంబభ్యులు కత్తితో పొడిచారు. వివరాలు.. దాగినకట్టె గ్రామానికి చెందిన లీలావతి (18), సిద్ధేశ్ ప్రేమించుకున్నారు. పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా ఇటీవలే వివాహం చేసుకున్నారు. లీలావతి కుటుంబం నుంచి బెదిరింపులు వస్తుండడంతో ఇద్దరూ జిల్లా ఎస్పీని కలిసి భద్రత కల్పించాలని కోరారు. ఎస్పీ సూచనల మేరకు ఇద్దరూ బసవాపట్టణ పోలీస్‌స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేయాలనుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఉండగానే యువతి కుటుంబీకులు సిద్ధేశ్‌ను కత్తితో పొడిచి హత్యాయత్నం చేశారు. యువతిని తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు సిద్ధేశ్‌ను దావణగెరెలోని ఎస్‌ఎస్ ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఐసీయూలో ఉంచారు. పోలీసు స్టేషన్‌లోనే హత్యాయత్నం జరగడంతో పోలీసులపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) అలీ ఖమేనీ అంతిమ యాత్ర.. ట్రంప్ ను హతమార్చాలి సంచలన ఆడియో లీక్ .. ఏదేమైనా.. నా భర్తను చంపే బాధ్యత నీదే.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు... YSRCP శృంగరపాటి సందీప్ కుమార్ బలవంతపు అక్రమ అరెస్ట్ ప్రశ్న రావణ్ పై పవన్ కళ్యాణ్ కు ఎందుకంత కక్ష అంటే.. నేను గన్నవరంలో కేసు పెట్టాడని కారణం కూడా అదే



