
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Parents Voter Details: ఓటరు జాబితా కోసం నమోదు చేసుకునేవారు తమ తల్లిదండ్రుల ఓటరు వివరాలను తప్పనిసరిగా సమర్పించాలన్న నిబంధనపై వచ్చిన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇది కొత్త నిబంధన కాదని.. ఓటరు జాబితాలో పారదర్శకత, కచ్చితత్వాన్ని పెంచేందుకే దీనిని అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకురావడం, ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడమే దీని ప్రాథమిక ఉద్దేశ్యమని ఈసీ పేర్కొంది. ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు, కొత్త ఓటర్లు తమ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల పేర్లు పాత ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో తెలియజేయాల్సి ఉంటుంది. కొత్త దరఖాస్తులను పాత ఓటరు రికార్డులతో అనుసంధానించడం ద్వారా నకిలీ ఓట్లను సులభంగా నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానాన్ని గత ఏడాది జూన్‌లో (2025) బీహార్‌లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ద్వారా 47 లక్షల నకిలీ, చెల్లని ఓట్లను తొలగించారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో సుమారు 6 శాతానికి సమానం. బీహార్‌లో దీని విజయంతో, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా ఈ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించారు. మరణించిన వారు.. నకిలీ ఓట్లు వేసిన వారి వివరాలను సేకరించి, వారిని జాబితా నుండి తొలగించడానికి బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు హక్కుకు అర్హులైన ఏ పౌరుడికీ