
ఇంటర్నెట్ డెస్క్: మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘తుడక్కం’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మోహన్ లాల్ కుమార్తె విస్మయ (Vismaya Mohanlal). జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మహిళా ప్రాధాన్యమున్న మలయాళ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ నివేదికల ప్రకారం.. ‘తుడక్కం’ (Thudakkam) మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.6.8 కోట్లు వసూలు చేసింది. భారత్‌లో 1100ల థియేటర్‌లలో దీన్ని విడుదల చేశారు. ఓవర్సీస్‌లోనూ దీనికి మంచి స్పందన రావడంతో రికార్డు నెలకొల్పింది. మొదటి రోజు భారత్‌లో రూ.2.55 కోట్లు సొంతం చేసుకుంది. దీంతో అంతకుముందు కల్యాణి ప్రియదర్శన్ నటించిన ‘కొత్తలోక’ సినిమా తొలిరోజు (రూ.6.63 కోట్ల) ప్రపంచ వ్యాప్త వసూళ్లను ‘తుడక్కం’ అధిగమించింది. విస్మయ మోహన్‌లాల్, ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ కుమారుడు ఆశిష్ జోస్ ఆంటోనీలకు ఇది తొలి చిత్రం. ‘మీను’ పాత్రలో విస్మయ ఎంతో సహజంగా నటించగా, ఆశిష్ సైకో పాత్రలో తన నటనతో భయపెట్టారు. సమాజంలో మహిళలు ఎదుర్కొనే వేధింపులు, లైంగిక దాడులు, మనుగడ కోసం ఒక యువతి చేసే పోరాటం నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ‘పళ్ళ బురుసు’ లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ