కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారా
Actor ProfilePolitician

కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారా
Namasthe Telangana4 Dec 2026
కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారా

MLA Pocharam | కామారెడ్డి, ఆగస్టు 11 : అభివృద్ధికి సహకరిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెబితేనే తాను పార్టీలో చేరానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు చెక్ డ్యాం వద్ద నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పోచారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కానీ పరిస్థితుల ప్రభావంతో తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 మాసాలలో బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబితేనే జాతీయ కండువా కప్పుకున్నానన్నారు. ముఖ్యమంత్రి మాటలు మంత్రులు వినడం లేదని..సీఎం స్వయంగా మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పినా మంత్రులు సీఎం మాటలు పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సీఎం మాటలు వినడం లేదని పోచారం వాపోయారు. వేం నరేందర్ రెడ్డికి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవడం లేదు. వేం నరేందర్ రెడ్డి కి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు. అప్పటి రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారాల్సి వచ్చిందన్నారు పోచారం. Chalivagu project | చలివాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరందించాలని బీఆర్‌ఎస్‌ ధర్నా High Alert | ఢిల్లీలో ఉగ్ర‌దాడులు జ‌రుగ‌వ‌చ్చ‌న్న ఇంటెలిజెన్స్‌.. అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర ప్ర‌భుత్వం Dhanush Fans | కోయంబత్తూరులో భారీ ప్లాన్‌.. ధనుష్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ మొదలైన చర్చ!