
90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రంభ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది. అందులో రంభ సరిగ్గా నడవలేక, ఒకరి సహాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. టాలీవుడ్ తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ పరిశ్రమల్లో కూడా స్టార్ హీరోయిన్ గా ఊపేసింది రంభ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ తో పాటు, రాజేంద్రప్రసాద్, సుమన్ లాంటి హీరోలతో నటించి మెప్పించింది రంభ. రజినీకాంత్, విజయ్ కాంత్, సల్మాన్ ఖాన్,వివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది రంభ. 15 ఏళ్ళకు పైగా వరుస హిట్ సినిమాలతో అదరగొట్టింది బ్యూటీ. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిన తర్వాత ఇండస్ట్రీకి కంప్లీట్ గా దూరం అయ్యింది బ్యూటీ.. కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టింది. చాలా మంది హీరోయిన్లు సినిమాలు తగ్గి..ఫెయిడ్ అవుట్ అయిన తరువాత పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి కుటుంబానికే పరిమితమవుతుంటారు. కానీ రంభ మాత్రం కొత్త దారి ఎంచుకుంది. కెనడాకు చెందిన బిజినెస్ మెన్ ఇంద్రకుమార్ పద్మనాథన్ ను పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లిపోయింది. అక్కడ కుటుంబానికే పరిమితం కాకుండా.. వ్యాపారంలోకి అడుగు పెట్టింది. భర్త వ్యాపారాల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే, సొంతంగా వ్యాపార రంగంలో పట్టు సాధించారు. ప్రస్తుతం రంభ భర్త వ్యాపారల్లో కొన్నింటికి బాస్ గా ఉన్నట్టు సమాచారం. హీరోయిన్ గా కొంత ఆస్తులు సంపాదించిన రంభ.. వాటిని కొన్ని వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. భర్త వ్యాపారాలతో పాటు రంభ ఆస్తులు అన్ని కలుపుకుని దాదాపు 2000 కోట్లు సంపాదించిందని అంచనా. ఈ విషయంలో రంభ నుంచి