కూటమి విజ్ఞప్తి! ఫేక్ ఐడీల
Actor ProfilePolitician

కూటమి విజ్ఞప్తి! ఫేక్ ఐడీల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కూటమి విజ్ఞప్తి! ఫేక్ ఐడీలపై ఉమ్మడి సమరం
Oneindia Telugu6 Dec 2026
కూటమి విజ్ఞప్తి! ఫేక్ ఐడీలపై ఉమ్మడి సమరం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం రోజురోజూకు ఊహించని ఎత్తుగడలతో హీట్ ఎక్కుతుంది. ఓవైపు ప్రజాక్షేత్రంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం, మరోవైపు డిజిటల్ వేదికగా సాగుతున్న ఫేక్ ఐడీలపై యుద్ధం ప్రకటించింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల.. ఎన్డీయే కూటమి మధ్య పూడ్చలేని వ్యత్యాసాలు సృష్టించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మైండ్ గేమ్‌కు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ రంగంలోకి దిగి, తమ శ్రేణులకు, అభిమానులకు అత్యంత కీలకమైన ఉమ్మడి విజ్ఞప్తిని, హెచ్చరిక ప్రకటనను విడుదల చేసింది.ఇటీవల సోషల్ మీడియాలో గోడమీద పిల్లి లాంటి వైఖరితో సాగుతున్న సూడో, ఫేక్ ఖాతాల వ్యవహారం కూటమి పెద్దల దృష్టికి వచ్చింది. టీడీపీ అభిమానిలా నటిస్తూ పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా దూషించడం, లేదా జనసేన కార్యకర్తలా కనిపించే ఫేక్ ఐడీతో చంద్రబాబును విమర్శించడం ద్వారా ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు ముమ్మరంగా సాగుతున్నాయని ప్రకటనలో ఎండగట్టారు. ఈ ఫేక్ ప్రచారాల వలలో పడి అసలైన కార్యకర్తలు ఆవేశానికి లోనై పరస్పరం దాడులకు దిగడం వల్ల, అంతిమంగా వైఎస్సార్సీపీకే రాజకీయంగా ప్రయోజనం చేకూరుతోందని కూటమి నాయకత్వం స్పష్టం చేసింది. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో మిత్రధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించవద్దని కోరింది. కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు - వైసీపీ దూకుడు కు బ్రేక్..!!సహించేది లేదు.. మితిమీరితే కఠిన చర్యలు తప్పువు!కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న ఈ సైబర్ కుట్రలను అడ్డుకునేందుకు మూడు పార్టీల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు లేదా కక్షపూరిత ప్రచారానికి దిగితే, వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. ఏ పార్టీ శ్రేణులైనా సరే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అనుమానాస్పద

క టమ వ జ ఞప త ఫ క ఐడ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in