కోకాపేటలోని నివాసంలో హరీశ్ రావు హౌస్ అరెస్ట్
Actor ProfilePolitician

కోకాపేటలోని నివాసంలో హరీశ్ రావు హౌస్ అరెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోకాపేటలోని నివాసంలో హరీశ్ రావు హౌస్ అరెస్ట్
AP7AM14 Jan 2027
కోకాపేటలోని నివాసంలో హరీశ్ రావు హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు కోకాపేట్‌లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆస్పత్రిని సందర్శించేందుకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. ఈ పర్యటన పిలుపు నేపథ్యంతో తెల్లవారుజాము నుంచే కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హరీశ్ రావు ఇల్లు విడిచి బయటకు రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది. ఈ ఆకస్మిక పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా... హరీశ్ రావు హౌస్ అరెస్ట్ వార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

క క ప టల న న వ స ల హర శ ర వ హ స అర స ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in