
పొద్దుపొడవక ముందే గడప ముందర నిలిచి.. గోమయపు చల్లదనాన్ని ముంగిలికి అద్ది.. లక్ష్మీదేవిని పిలిచే పల్లెటూరి పవిత్ర సంప్రదాయంతో అలంకారమవ్వాల్సిన ఇంటి ముంగిలిని.. రంగుల ముసుగులో విషనిలయం చేసేశారు! గుబాళించాల్సిన పేడ నీళ్ల సువాసనను.. రసాయనపు రంగులతో మృత్యువుగా మార్చేశారు! ఇంటి ముందు చల్లిన ఆ కళ్లాపి.. నేడు కన్నీటి సుడులను చల్లుతోంది! కల్తీ ముఠా కన్నెర్ర చేసిన పాపానికి.. పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతోంది! కళకళలాడాల్సిన వాకిలి.. కలకలం రేపుతూ ప్రాణాలను బలిగొంటోంది!మన సంస్కృతికి, పల్లెటూరి అందానికి ప్రతీకగా నిలిచే కళ్లాపి చల్లడం అనే పవిత్రమైన సంప్రదాయంపై కల్తీ వ్యాపారుల విషపు నీడలు కమ్ముకున్నాయి. పొద్దున్నే లేచి ఇల్లూ-వాకిలి శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించే ముంగిలి.. నేడు ప్రాణాంతక రసాయనాల అడ్డాగా మారుతోంది. ముగ్గు వేయడానికి, గుబాళింపు కోసం ఉపయోగించే పేడ నీళ్ల పౌడర్ (కళ్లాపి పౌడర్) పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ తయారీదారులపై వైఎస్సార్ కడప జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అత్యంత ప్రమాదకరమైన Auramine-O అనే విష రసాయనంతో ఈ పౌడర్‌ను తయారు చేస్తున్న ఐదు పరిశ్రమలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించి, వాటిని సీజ్ చేసి సీల్ వేశారు.ఏడాదిన్నరలో 19 మంది ఆత్మహత్యసహజసిద్ధమైన పేడ నీళ్లకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి వచ్చిన ఈ కళ్లాపి పౌడర్ ఎంతటి దారుణాలకు కారణమవుతుందో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం వెల్లడించిన వివరాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చౌకగా లభిస్తూ, ఇంట్లోనే అందుబాటులో ఉంటుండడంతో.. క్షణికావేశంలో ఈ విషపూరిత పౌడర్ సేవించి గత ఏడాదిన్నర కాలంలో (2025 జనవరి 1 నుంచి 2026 జూలై 6 వరకు) జిల్లా వ్యాప్తంగా ఏకంగా 19 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మరణాల వెనుక ఉన్న మూలాలను వెతుకుతూ వెళ్లిన పోలీసులకు ప్రొద్దుటూరులో సాగుతున్న రసాయన దందా గుట్టు రట్టయింది. మటన్‌లో ఎద్దు మాంసం.. కాసుల కక్కుర్తితో నరరూప