కళ్లుచెదిరే రేటుకు జైలర్ 2’ ఓటీటీ రైట్స్
Actor ProfileActor

కళ్లుచెదిరే రేటుకు జైలర్ 2’ ఓటీటీ రైట్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కళ్లుచెదిరే రేటుకు జైలర్ 2’ ఓటీటీ రైట్స్
123Telugu17 Dec 2026
కళ్లుచెదిరే రేటుకు జైలర్ 2’ ఓటీటీ రైట్స్

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ డిజిటల్ రైట్స్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ ఫిలిం వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 160 కోట్లకు చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్ ‘జైలర్’ డిజిటల్ రైట్స్ రూ.100 కోట్లకు అమ్ముడవ్వగా, ఈ సీక్వెల్‌కు అంతకుమించిన ధరకు డీల్ కుదరడం తమిళ చిత్రసీమలో అత్యంత భారీ ఓటీటీ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజినీకాంత్ మళ్లీ సందడి చేయనున్న ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్‌కి ముందే ఓటీటీ రూపంలో ఈ స్థాయిలో భారీ మొత్తం దక్కడంతో మేకర్స్ లాభాల బాట పట్టినట్లేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి

కళ ల చ ద ర ర ట క జ లర 2 ఓట ట ర ట స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in