
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Boat Tragedy Telugu News Latest: ఆనందంగా సాగుతున్న విహారయాత్రలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడుపుదామని వెళ్లిన పర్యాటకులను మృత్యువు బోటు రూపంలో కబళించింది.. వియత్నాంలో శనివారం జరిగిన ఒక ఘోర స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు మరణించారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 36 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.. నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయిన ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షులు చెబుతుంది ఇదే.. ఈ ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు పర్యాటకులు ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం... "మేమంతా ఎంతో ఉత్సాహంగా ఆ స్పీడ్ బోట్ ఎక్కాం.. మొత్తం 36 మంది ప్రయాణికులం ఉన్నాం.. అదొక క్లోజ్డ్ బోట్.. బోట్ ప్రయాణం ప్రారంభమైన కేవలం మూడు నిమిషాలకే ఒక్కసారిగా ఒక భారీ అల బోటును బలంగా ఢీకొట్టింది. అంతే.. చూస్తుండగానే బోటు ఒక్కసారిగా తలకిందులైపోయింది." అని ఆయన వివరించారు. ముందు కూర్చున్న వారు సేఫ్.. బోటు తిరగబడిన సమయంలో లోపల ఉన్న పర్యాటకులు ప్రాణాల కోసం ఎలా కొట్టుమిట్టాడారో సాక్షులు వివరించారు. బోటు ముందు భాగంలో కూర్చున్న సుమారు 20 మంది పర్యాటకులు, ప్రమాదం జరగగానే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారని.. అక్కడే ఉన్న విండోస్ గుండా ఎలాగోలా బయటకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారన్నారు. బోటు వెనుక భాగంలో కూర్చున్న వారు మాత్రం బయటకు రాలేకపోయారని.. బోటు