కల్వర్టులో బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు
Actor ProfilePolitician

కల్వర్టులో బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కల్వర్టులో బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు
Samayam Telugu18 Nov 2026
కల్వర్టులో బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామిడి మండలం పొగరూరు సమీపంలోని బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో రెండూ కూడా కల్వర్టుపై నుంచి కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 32 మందిలో 20 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. అటువైపు వెళ్తున్న వారు చూసి విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పడంతో, సహాయక చర్యలు మొదలయ్యాయి.హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న లారీ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనతో రెండు వాహనాలు కూడా కల్వర్టులోకి పడిపోయాయి. స్థానికులు వెంటనే రెండు వాహనాల డ్రైవర్లను బయటకు తీశారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పామిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం, నిద్ర మత్తే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఘటనకు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు