
తెలంగాణలో పేద కుటుంబాల ఇంట్లో పెళ్లిళ్లకు ఆర్థిక భరోసానిచ్చే 'కల్యాణలక్ష్మి', 'షాదీ ముబారక్' పథకాల అమలుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన తెలంగాణ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పథకాల కింద లబ్ధిదారులకు ఎలాంటి నగదు చెల్లింపులు చేయవద్దని స్పష్టం చేస్తూ తాత్కాలిక ఇంజక్షన్ జారీ చేసింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని నిధుల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అసలు హైకోర్టు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ పథకం పూర్తిగా నిలిపివేయనున్నారా? న్యాయవాది విజయ్ గోపాల్ వ్యక్తిగత హోదాలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2014 నుంచి అమలు చేస్తున్న ఈ పథకాలకు అసెంబ్లీలో ఎలాంటి ప్రత్యేక చట్టం లేదా తీర్మానం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోల) ఆధారంగానే రూ.13,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 202(3), 204(3), 266(3), 283(2) నియమాలను ఉల్లంఘిస్తూ, చట్టసభల అధికారాన్ని కార్యనిర్వాహక వర్గం తన చేతుల్లోకి తీసుకుందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలోనే జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఆదేశించింది. జూలై 8న సమయం ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా బుధవారం జరిగిన విచారణలో కూడా ప్రభుత్వం తరఫు న్యాయవాది మరికొంత సమయం కోరడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో 2014 నుండి 2019 వరకు ఈ పథకాల కోసం జారీ చేసిన 8 జీవోల అమలుపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ కేసు విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ పథకం ప్రయోజనాలు నిలిచిపోనున్నాయి. ఈ తాత్కాలిక ఇంజక్షన్ ప్రకారం, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు



