కల్కి 2' సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించాలని ఉందా? మేకర్స్ అధికారిక ప్రకటన
Actor ProfileActor

కల్కి 2' సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించాలని ఉందా? మేకర్స్ అధికారిక ప్రకటన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కల్కి 2' సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించాలని ఉందా? మేకర్స్ అధికారిక ప్రకటన
Zee Telugu29 Nov 2026
కల్కి 2' సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించాలని ఉందా? మేకర్స్ అధికారిక ప్రకటన

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Prabhas Kalki 2 Casting Call: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సంచలన విజయం సాధించిన చిత్రం 'కల్కి 2898 AD'. సోషియో-ఫాంటసీ మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కల్కి 2' అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే సువర్ణావకాశాన్ని కల్పిస్తూ మేకర్స్ ఒక కీలక ప్రకటన చేశారు. 'కల్కి సినిమాటిక్ యూనివర్స్' కోసం చిత్ర బృందం అధికారికంగా కాస్టింగ్ కాల్ ప్రకటించింది. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ బిగ్ స్క్రీన్ పై కనిపించే అద్భుతమైన అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు లేవు.. ప్రతిభే ముఖ్యం! ఈ కాస్టింగ్ కాల్‌కు సంబంధించి మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "నటులుగా రాణించాలనుకునే వారందరికీ ఇదొక చక్కని అవకాశం. 'కల్కి సినిమాటిక్ యూనివర్స్'లో భాగం అవ్వండి" అని పిలుపునిచ్చారు. ఈ ఆడిషన్‌కు సంబంధించి ఎలాంటి వయసు లేదా లింగ ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. కేవలం ప్రతిభ ఉంటే చాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలు, పోర్ట్‌ఫోలియోలను kalkiuniversecasting@gmail.com అనే అధికారిక ఈ-మెయిల్ ఐడీకి పంపించాలని వైజయంతీ మూవీస్ పేర్కొంది. గతంలోనూ అదే పద్ధతి.. మొదటి భాగం 'కల్కి' సమయంలోనూ మేకర్స్ ఇలాగే కాస్టింగ్ కాల్ నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు