
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండపై వైసీపీ తన పోరాటాన్ని తీవ్రతరం చేసింది. అక్కడ జరుగుతున్న మైనింగ్ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, వారసత్వ సంపద నాశనమవుతోందని వైఎస్సార్


ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండపై వైసీపీ తన పోరాటాన్ని తీవ్రతరం చేసింది. అక్కడ జరుగుతున్న మైనింగ్ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, వారసత్వ సంపద నాశనమవుతోందని వైఎస్సార్

ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించటం కోసం వైయస్ జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జగన్ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వైసీపీ నేతలతో పాటు జగన్ కు షాక్ ఇచ్చాయి.ఓర్వకల్లు విమానాశ్రయంలో జగన్ గోబ్యాక్ ఫ్లెక్సీలుఈ రోజు ఉదయం 9గంటలకు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి జగన్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఓర్వకల్లు విమానాశ్రయం వద్ద వివాదాస్పద ప్లెక్సీలు వెలిశాయి.. జగన్ గో బ్యాక్ అంటూ పెద్ద అక్షరాలతో రాసిన ఫ్లెక్సీలను అక్కడ ఏర్పాటు చేశారు. ఇవి వైసీపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.జగన్ ను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు.. తొలగించిన పోలీసులు ఎస్సీలపై దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యేని పరామర్శించడానికి సిగ్గులేదా అని, అలాగే డీఎస్సీ నియామకాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని జగన్ ను టార్గెట్ చేస్తూ వేర్వేరు ప్లెక్సీల్లో రాశారు. ఈ ప్లెక్సీలను పోలీసులు వెంటనే తొలగించారు. అదే సమయంలో విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎవరినీ లోపలికి అనుమతించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.కర్నూలు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తపరిస్థితిజగన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నాయకులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇక తాజాగా జగన్ గో బ్యాక్ ఫ్లెక్సీల ఏర్పాటుతో కర్నూలు జిల్లాలో జగన్ రాకను పురస్కరించుకుని రాజకీయ ఉద్రిక్తత కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధినేత సందర్శనకు ముందే వ్యతిరేక ప్లెక్సీలు ఏర్పాటు కావటం, పోలీసులు వాటిని తొలగించడం, పార్టీ కార్యకర్తలు సమావేశం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.పోలీసుల భారీ బందోబస్తు.. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న జగన్ విమానాశ్రయం చుట్టూ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు