
ప్రతినెలా వచ్చే కరెంట్ బిల్లు చూసి "ఇక ఇంట్లో సోలార్ ప్యానెల్ పెట్టేస్తే ఈ బిల్లు గోల ఉండదు కదా?" అని చాలామంది అనుకుంటారు. కానీ సోలార్ పెట్టాలంటే మొదట్లోనే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాలి. అదే కరెంట్ కనెక్షన్‌కు మొదట్లో పెట్టుబడి అవసరం లేదు, కానీ జీవితాంతం బిల్లు కడుతూనే ఉండాలి. ఇంతకీ సోలార్ సిస్టమ్ పెట్టడం లాభమా? లేక కరెంటు బిల్లు కట్టుకోవడమే బెటరా? ఓ సింపుల్ లెక్కతో చూద్దాం. మంచి వాతావరణంలో 1 kW గ్రిడ్-కనెక్టెడ్ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ రోజుకు సగటున 4-5 యూనిట్ల వరకు కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యానెల్స్ లైఫ్‌టైమ్ 25 ఏళ్ల వరకు ఉంటుంది. అంటే 1 kW సోలార్ సిస్టమ్ ఏడాదికి సుమారు 1,460-1,825 యూనిట్ల వరకు కరెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ సూర్యరశ్మి, నీడ, ప్యానెల్ నాణ్యత, ఇంటి పైకప్పు నిర్మాణం, నిర్వహణ వంటి కారణాలతో ఉత్పత్తిలో మార్పులు ఉంటాయి. 1 kW సోలార్ సిస్టమ్ పెట్టడానికి దాదాపు 10 చదరపు మీటర్ల నీడ పడని ఖాళీ స్థలం అవసరం. ఒక ఇంట్లో నెలకు 200–300 యూనిట్ల కరెంట్ వాడితే, వాళ్లు 2 kW లేదా 3 kW రూఫ్‌టాప్ సోలార్ గురించి ఆలోచించవచ్చు. 2 kW సోలార్ సిస్టమ్ రోజుకు సుమారు 8–10 యూనిట్లు, 3 kW సోలార్ సిస్టమ్ రోజుకు సుమారు 12–15 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. అయితే వర్షాలు, మబ్బులు, నీడ వల్ల ఉత్పత్తి తగ్గవచ్చు. కేంద్ర ప్రభుత్వ 'పీఎం సూర్యఘర్ యోజన (PM-Surya Ghar: Muft Bijli Yojana)' పథకం కింద, ఇళ్లపై సోలార్ సిస్టమ్స్ పెట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం… మొదటి 2 kW సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60% వరకు, అదనంగా మరో 1 kW సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే దీనిపై