
ఏపీలో పట్టిసీమ వద్ద నీటిని వాడుకుంటుంటే తెలంగాణలో ఎందుకు వాడరు? ఇది సీఎం తెచ్చిన కరవు: కేటీఆర్ ఈనాడు, హైదరాబాద్: మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి రోజూ రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఆ నీటితో గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీ, లోయర్, మిడ్ మానేరు, మల్లన్నసాగర్, బస్వాపూర్ జలాశయాలను నింపి సాగునీటి ఇబ్బందులను తీర్చవచ్చన్నారు. ఈ విషయాన్ని రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ కూడా స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నది కాలం తెచ్చిన కరవు కాదని, భారాసపై కక్షతో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ... ప్రజలపై రుద్దుతున్న కరవని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కన్నెపల్లి పంపుహౌస్ వద్ద 96.79 మీటర్లలో నీటి ప్రవాహం ఉంది. ఇక్కడి నుంచి రోజూ 9 టీఎంసీల నీరు వృథాగా పోతోంది. ఈ ఏడాది అక్టోబరు వరకు ఇక్కడి నుంచి ఈ నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఈ ప్రాంతం నుంచే ప్రవహిస్తున్న గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్‌లోని పట్టిసీమ వద్ద అక్కడి ప్రభుత్వం ఎత్తిపోసుకుంటోంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? తన గురువుకు దక్షిణ కింద కన్నెపల్లి వద్ద నీటిని వాడుకోవడం లేదా? భారాసపై కోపముంటే మాపై కేసులు పెట్టండి.. తిట్టండి. లక్షల మంది రైతుల నోట్లో మాత్రం మట్టి కొట్టొద్దు. 2022 జులైలో భయంకరమైన వరద వస్తే కూడా తట్టుకొని మేడిగడ్డ... మేటిగడ్డగా నిలిచింది. భద్రాచలానికి రాష్ట్రంలో ప్రవహిస్తున్న నీటితో ముంపు లేదు. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడంతోనే ముంపు ఏర్పడుతుంది. కాళేశ్వరం గురించి రేవంత్‌రెడ్డికి తలా తోక తెలియదు. కన్నెపల్లి వద్ద నీళ్లను ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నా రాజకీయ ద్వేషంతో కళ్లు మూసుకున్నారు. నీళ్ల కోసం రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో రేవంత్‌రెడ్డికి అసహనం కలుగుతోంది. ఎప్పుడూ స్థిరాస్తి వ్యాపారం.. ఎనుముల అన్నదమ్ముల