కన్నవారి కల నెరవేర్చిన కొడుకు.. తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించిన యువకుడు
Actor ProfilePolitician

కన్నవారి కల నెరవేర్చిన కొడుకు.. తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించిన యువకుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కన్నవారి కల నెరవేర్చిన కొడుకు.. తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించిన యువకుడు
Zee Telugu17 Jan 2027
కన్నవారి కల నెరవేర్చిన కొడుకు.. తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించిన యువకుడు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Emotional Family Video: కన్నవారి కలలను నెరవేర్చడంలో ఉండే ఆనందం అంతో, ఇంతో కాదు.. పేదరికంలో పుట్టినా.. పట్టుదలతో శ్రమించి పైకొచ్చి.. అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూస్తే.. ఆ తృప్తి ముందు కోట్ల రూపాయలు కూడా పనికారవు.. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఒక యువకుడు తన తల్లిదండ్రులను తొలిసారిగా విమానం ఎక్కించి.. వారి జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభూతిని బహుమతిగా అందించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియో ఇప్పుడు లక్షలాది నెటిజన్ల హృదయాలను గెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఖేము సైనీ అనే యువకుడు ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఒకప్పుడు కుటుంబ తినడానికి చాలా కష్టం అయ్యేది.. నెలకు కేవలం 6 నుంచి 7 వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తూ.. తీవ్రంగా కష్టపడేవాడు.. ఆ సమయంలో పూట గడవడమే ఎంతో కష్టంగా ఉండేది.. అలాంటి పరిస్థితుల్లో విమానం ఎక్కడం అనేది ఆ కుటుంబానికి కలలో కూడా ఊహించని విషయంగానే భావించవచ్చు.. కానీ.. ఖేము తన పేదరికాన్ని చూసి అస్సలు కుంగిపోలేదట.. తన కష్టాన్ని నమ్ముకుని పగలు రాత్రి చాలా వరకు కష్టపడ్డాడు.. ఎంతో శ్రమతో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత.. తన తల్లిదండ్రులకు, అక్కకు విమాన ప్రయాణం చేయించాలనే తన చిరకాల కోరికను నెరవేర్చాడు. ఖేము సైనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (@tijara_vines01) ద్వారా