
వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో మరో చోరీ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. చెంగల చంద్రమ్మ తన కుమార్తె ఇంటికి హైదరాబాద్ కు వెళ్లగా, శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని 3 తులాల వెండి, తులం బంగారు చైన్ అపహరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఇల్లంద ఘటన మరువకముందే కట్ర్యాలలో నూ చోరీ జరగడంతో రెండు ఘటనలకు ఒకే దొంగల ముఠా కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. IND vs SLXI | టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్.. నబీ, సిరాజ్ చెలరేగేనా..! Actor Ali | ఐదేళ్లకోసారి వాడుకుని వదిలేశారు, కరివేపాకులా తీసేశారు.. ఆలీ సంచలన వ్యాఖ్యలు! Keerthy Suresh | సినిమా ఆఫర్లు లేవని ట్రోలింగ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన కీర్తి!