ఓలమ్మో వగలాడీ.. నువ్వే నా అమ్మాడి
Actor ProfileActor

ఓలమ్మో వగలాడీ.. నువ్వే నా అమ్మాడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓలమ్మో వగలాడీ.. నువ్వే నా అమ్మాడి
Chitrajyothy11 Dec 2026
ఓలమ్మో వగలాడీ.. నువ్వే నా అమ్మాడి

యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా, దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సిగ్మా (Sigma). యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishna) కథానాయకుడిగా, దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సిగ్మా (Sigma). లైకా ప్రొడక్షన్స్, జేఎస్జే మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఓలమ్మో వగలాడీ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన మాస్ అండ్ క్యాచీ బీట్స్‌కి తగ్గట్టుగా రచయిత కృష్ణ చైతన్య అలరించే సాహిత్యాన్ని అందించాడు. వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, సంజన దివాకర్ కల్మంజేలతో కలిసి ఈ పాటను తమదైన శైలిలో ఆలపించారు. పాటలో సందీప్ కిషన్ మాస్ స్టైలిష్ లుక్స్‌తో మెరవగా, కథానాయిక ఫరియా అబ్దుల్లా తన గ్లామర్ తో అదరగొట్టేసింది. తొలి చిత్రంతోనే జేసన్ సంజయ్ తన మేకింగ్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ఈ సాంగ్‌ను విజువల్‌గా చాలా రిచ్‌గా తెరకెక్కించాడు. థమన్ అందించిన ఎనర్జెటిక్ మ్యూజిక్, నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. విజయ్ కుమారుడు కావడంతో అటు తమిళ్ లో ఇటు తెలుగులో సిగ్మా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో జేసన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా.. లేదా అనేది చూడాలి

ఓలమ మ వగల డ న వ వ న అమ మ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in