ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ
Actor ProfilePolitician

ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నాడు
AP7AM17 Oct 2026
ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నాడు

"ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, కళ్లెదుట బ్రతికున్న కన్నతల్లికి మాత్రం ఆస్తిలో వాటా ఇవ్వకుండా క్షోభ పెడుతున్న వ్యక్తి మనకెందుకు?" అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కన్నతల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తులు రాష్ట్ర ప్రజలకు ఏం సేవ చేస్తారని ఆయన ప్రశ్నించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో 'మీ భూమి- మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.గత ప్రభుత్వ పెద్దల తీరును ఎండగడుతూ, "తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించి అపచారం చేశారు. నేను మాత్రం చర్చికి, మసీదుకు వెళ్లినా అక్కడి ఆచారాలను గౌరవిస్తాను. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి వైసీపీకి చెందిన వాడే అని తెలియగానే తోక ముడిచారు. బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వకుండా క్షోభ పెడుతూ, ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తున్నారు. తల్లికి గౌరవం ఇవ్వని ఇలాంటి వ్యక్తులు మన సమాజానికి అవసరమా?" అని ప్రజలను ప్రశ్నించారు."కుట్రలు, కుతంత్రాలతో కులం, మతం, ప్రాంతాల పేరుతో సమాజాన్ని విడదీసేందుకు 'గొడ్డలి పార్టీ' ప్రయత్నిస్తోంది. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్‌లను పెంచి పోషిస్తూ, రౌడీయిజంతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది" అని ఆయన ఆరోపించారు.గత పాలనలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అనేక ఘటనలు జరిగాయని చంద్రబాబు గుర్తుచేశారు. "అంతర్వేది రథం దగ్ధం, దుర్గమ్మ గుడిలో వెండి సింహాల చోరీ, రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం వంటి ఘటనల్లో గత పాలకులు నిందితులపై కనీస చర్యలు తీసుకోలేదు. చివరికి తిరుపతి వెంకన్న

ఓట ల క స త డ ర సమ ధ క ప జల చ స త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in