
సినీ ప్రియులు, వెబ్ సిరీస్ అభిమానులకు ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికరమైన కంటెంట్‌లు అందుబాటులోకి రానున్నాయి. తమిళ డేటింగ్ రియాలిటీ షో నుంచి హాలీవుడ్ యాక్షన్ హారర్ చిత్రాల వరకు, క్రైమ్ డ్రామాల నుంచి కొరియన్ రొమాంటిక్ సిరీస్‌ల వరకు ఎన్నో కొత్త టైటిల్స్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’, ‘రక్తాంచల్ 3’, ‘వుదరింగ్ హైట్స్’, ‘రెడీ ఆర్ నాట్ 2’ వంటి టైటిల్స్ ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ డేటింగ్ రియాలిటీ షో ‘సెకండ్ లవ్’ తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఒకే ఇంట్లో కలిసి రెండోసారి ప్రేమను వెతుక్కునే ప్రయత్నం చేయడం ఈ షో ప్రధానాంశం. ‘బిగ్‌బాస్ 18’ ఫేమ్ శ్రుతికా అర్జున్ ఇందులో మార్గదర్శకురాలిగా కనిపించనుంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామాలో స్వర్ణ అనే మాజీ హంతకురాలు పెళ్లి తర్వాత తన పాత జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఆమె గతం మళ్లీ ఆమె జీవితంలోకి రావడంతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఎమిలీ బ్రాంటే రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాలో జేకబ్ ఎలోర్డి, మార్గోట్ రాబీ ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు రానుంది. రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్ (Ready Or Not 2: Here I Come) 2019లో విడుదలైన హిట్ యాక్షన్ హారర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. గ్రేస్ పాత్ర మరోసారి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ కనిపించనుంది. విల్ ఫెరెల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కామెడీ సిరీస్‌లో ఒకప్పటి నంబర్ వన్ గోల్ఫర్ లానీ










