రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ ఎమోషనల్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేసింది. ఈరోజు (జులై 9) నుంచి ‘పెద్ది’ సినిమా ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన 35 రోజులకు ఓటీటీలో రిలీజ్ చేశారు. తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి హిందీ వెర్షన్ లేదు. త్వరలో అందుబాటులోకి వస్తుందని మేకర్స్ తెలిపారు. ఓటీటీలో రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. థియేట్రికల్ వెర్షన్ కంటే ఓటీటీలో కొన్ని సీన్స్ యాడ్ చేశారు.‘పెద్ది’ సినిమా 3 గంటలకు పైగా (189 నిముషాలు) నిడివితో థియేటర్లలో విడుదలైంది. కానీ రన్ టైమ్, కొన్ని సన్నివేశాలపై విమర్శలు రావడంతో సీన్స్ ట్రిమ్ చేశారు. థియేటర్‌లో తొలగించిన సన్నివేశాలను ఇప్పుడు ఓటీటీ వెర్షన్ లో జత చేశారు. దీంతో మెగా అభిమానులు ఖుష్ అవుతున్నారు. అయితే ట్రోలింగ్ కు గురైన హీరోయిన్ జాన్వీ కపూర్ క్లోజప్ షాట్స్ ను మాత్రం కట్ చేసినట్లు తెలుస్తోంది.'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో క్రికెటర్ గా, రెజ్లర్ గా, అథ్లెట్ గా చరణ్ ఆకట్టుకున్నారు. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టగలిగే ఆట కూలీ పెద్ది.. క్రికెట్‌ని వదిలి పహిల్వాన్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? అతడిగ్రామానికి వచ్చిన సమస్యేంటి? ఊరి కోసం పెద్ది ఏం చేశాడు? అనేది ఈ సినిమాలో మెయిన్ ప్లాట్. మైత్రీ
Actor ProfileActor
ఓటీటీలోకి వచ్చేసిన పెద్ది’.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•13 Oct 2026
ఓటీటీలోకి వచ్చేసిన పెద్ది’.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే