
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మిగతా భాషల్లో ప్రేక్షకులని అలరించిన చిత్రాలు, డబ్బింగ్‌ల రూపంలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా గత వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ 'పరిమిళ అండ్ కో'. జీ5 ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) కథేంటి? మిడిల్ క్లాస్‌కి చెందిన పరిమిళ(జయరాం).. తన భార్య స్వరాజ్యం(ఊర్వశి), కూతుళ్లు పరాశక్తి, మధుమితతో కలిసి ఓ అద్దె ఇంట్లో బతికేస్తుంటాడు. ప్రశాంతంగా ఉన్న వీళ్ల జీవితంలోకి వర్గీస్ (శాండీ మాస్టర్) అనే లోకల్ రౌడీ ఎంట్రీ ఇస్తాడు. పరిమళ చిన్న కూతురు మధుమిత వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని ఇబ్బందిపెడుతుంటాడు. ఈ టార్చర్ భరించలేక అతడిని చంపేస్తే బాగుంటుందని కుటుంబమంతా ఓ రోజు అనుకుంటారు. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు తెల్లారేసరికి వర్గీస్ హత్యకు గురవుతాడు. ఇంతకీ ఇతడిని చంపిందెవరు? పరిమళ కుటుంబానికి ఈ హత్యకు సంబంధముందా? లేదా? అనేది మిగతా స్టోరీ. ఎలా ఉందంటే? 'దృశ్యం' వచ్చిన తర్వాత ఈ తరహా కాన్సెప్ట్‌లతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా అలాంటి ఓ మూవీనే. కాకపోతే అది సీరియస్, దీన్ని మాత్రం కామెడీగా తీశారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటే ఏమవుతుంది? అనే సింపుల్ కాన్సెప్ట్ ఈ చిత్రంలోనూ చూపించారు. ఇక ఎలా ఉందంటే ఓటీటీలో చూస్తున్నప్పుడు అయితే ఓకే ఓకే అనిపించింది. మొదలైన అరగంట పాటు సినిమా చకచకా వెళ్తుంది. తర్వాత హత్య ఎవరు చేశారు? అనే దగ్గర పరిమిళ కుటుంబంలోని ఒక్కొక్కరిపై అనుమానం వచ్చేలా సీన్స్ వస్తుంటాయి. వీళ్లతో పాటు పరిమళ తమ్ముడు, బావమరిదిపై కూడా అనుమానం వస్తుంది. ఒకానొక దశలో ఎవరో చంపారనేది పరిమిళ కుటుంబానికి