ఓటీటీలోకి జగమే సంగీతం’ వెబ్ సిరీస్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Actor ProfileActor

ఓటీటీలోకి జగమే సంగీతం’ వెబ్ సిరీస్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓటీటీలోకి జగమే సంగీతం’ వెబ్ సిరీస్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Eenadu21 Jan 2027
ఓటీటీలోకి జగమే సంగీతం’ వెబ్ సిరీస్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, మధుబాల కీలక పాత్రల్లో రూపొందిన మ్యూజికల్‌ డ్రామా సిరీస్‌ ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై దీన్ని నిర్మించారు. ఇప్పుడీ సిరీస్‌ విడుదల తేదీ ఖరారైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా (Amazon Prime Video) సెప్టెంబర్‌ 4 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఈ సిరీస్‌లో సుమన్, సిజ్జు మేనన్‌, షఫీ, ఝాన్సీ, రఘు బాబు, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, రూప లక్ష్మి తదితరులు నటించారు. కర్ణాటక సంగీతపు కథతో ‘జగమే సంగీతం’ రాబోతోంది. తన తాత శాస్త్రి గారి ప్రఖ్యాత సంగీత వారసత్వానికి వారసుడైన బాలు.. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని తరతరాల వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడనేది ఈ సిరీస్‌ కథాంశం. ఈ కథకు సంగీతమే ప్రాణం. పాప్ స్టార్డమ్ ప్రపంచం నుంచి వచ్చిన ఒక గాయనికి, బాలుకు మధ్య ఏర్పడే బంధం చివరకు ఏవైపు వెళ్లిందనే కథాంశంతో దీన్ని రూపొందించారు. ఈ సందర్భంగా సుస్మిత కొణిదెల ఈ సిరీస్‌లోని పాత్రల గురించి మాట్లాడుతూ.. ‘‘సంగీతం కేవలం వారి ప్రపంచంలో ఒక భాగం మాత్రమే కాకుండా ఆ కుటుంబం మాటల్లో చెప్పలేని ప్రేమ, సంఘర్షణ, ఆరాటం, వంటి భావాలను వ్యక్తపరిచే భావోద్వేగ భాషగా మారే కథను చెప్పడం మా ఉద్దేశం. ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటీనటులు ఇందులో నటించడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత