ఒకే నగరం.. రెండు రాష్ట్రాలకు రాజధానిలా ఎలా మారింది? ఈ నగరం స్పెషాలిటీ ఏంటి
Actor ProfilePolitician

ఒకే నగరం.. రెండు రాష్ట్రాలకు రాజధానిలా ఎలా మారింది? ఈ నగరం స్పెషాలిటీ ఏంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒకే నగరం.. రెండు రాష్ట్రాలకు రాజధానిలా ఎలా మారింది? ఈ నగరం స్పెషాలిటీ ఏంటి
Asianet News Telugu20 Jan 2027
ఒకే నగరం.. రెండు రాష్ట్రాలకు రాజధానిలా ఎలా మారింది? ఈ నగరం స్పెషాలిటీ ఏంటి

రెండు వేర్వేరు రాష్ట్రాలు, రెండు వేర్వేరు ప్రభుత్వాలు.. కానీ రాజధాని మాత్రం ఒకటే. ఇది మరెక్కడో కాదు.. మన దేశంలోనే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు రెండింటికీ ఏకైక రాజధానిగా ఉన్న నగరం చండీగఢ్.. అసలు.. రెండు రాష్ట్రాలకు ఒకే నగరం రాజధానిలా ఎలా మారింది..? భారతదేశంలోని మొదటి ప్లాన్డ్ సిటీగా పిలిచే చండీగఢ్ నగరం కథేంటి? ఈ నగరం ఎందుకు అంత స్పెషల్..? ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం... ఈ ప్రాంతంలో ప్రసిద్ధ చండీ మందిరం ( దుర్గా దేవి గుడి) ఉంది. అలాగే ఇక్కడ ఫేమస్ గఢ్( కోట) కూడా ఉంది. ఈ రెండు పదాలను కలిపి చండీగఢ్ అనే పేరు పెట్టారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు.. పంజాబ్ పాత రాజధాని ‘లాహోర్’ పాకిస్తాన్ లోకి వెళ్లిపోయింది. దీంతో పంజాబ్ కోసం కొత్త రాజధాని నిర్మించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చండీగఢ్ ని రాజధానిగా నియమించారు. స్వతంత్ర భారత ప్రతిభను ప్రపంచానికి చూపించేలా ఒక ఆధునిక నగరాన్ని కట్టాలని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అనుకున్నారు.ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బుసియర్ ఈ నగరానికి ప్లాన్ వేశారు. విచిత్రమేంటంటే.. మనిషి శరీరం ఆధారంగా ఈ నగరాన్ని డిజైన్ చేశారు. క్యాపిటల్ కాంప్లెక్స్ తల భాగంలో, సిటీ సెంటర్ గుండె ఆకారంలో, పార్కులు, చెట్లు ఊపిరితిత్తులు గా విభజించారు. ఇక ఈ నగరాన్ని 'సెక్టర్లు'గా విభజించారు. ప్రతీ సెక్టార్‌లోనే బడులు, మార్కెట్లు, పార్కులు ఉండేలా ప్లాన్ చేశారు. అయితే చండీగఢ్‌లో సెక్టర్ 13 ఉండదు. 1966లో పంజాబ్ నుండి 'హర్యానా' ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మన తెలుగు రాష్ట్రాలు విడిపోయినట్లే పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. అయితే.. విభజన తర్వాత చండీగఢ్ మాదంటే మాదని ఇరు రాష్ట్రాలూ పట్టుబట్టాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారం కనుగొంది. చండీగఢ్‌ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా (UT) ప్రకటిస్తూ, రెండింటికీ ఉమ్మడి రాజధానిగా చేసింది

ఒక నగర ర డ ర ష ట ర లక ర జధ న ల ఎల మ ర ద ఈ నగర స ప ష ల ట ఏ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in