
Deepti Sati Latest News: దీప్తి సతి..ఈ పేరు చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ, టాలీవుడ్ ఓటీటీ ఫ్యాన్స్‌కు మాత్రం ఈమె తప్పుకుండా తెలుసు. ఎందుకంటే తెలుగులో ఒకే ఒక వెబ్‌సిరీస్‌తో ఎంతో ఫేమస్ అయ్యింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లో తిరువీర్ హీరోగా దీప్తి సతి కలిసి నటించిన వెబ్‌సిరీస్ 'సిన్'. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులు అయ్యినా.. ఇందులో ఆమె నటనతో దీప్తి తెలుగు ప్రేక్షకుల మనసును హత్తుకునే నటనతో రాణించింది. మోడలింగ్ రంగం నుంచి నటనపై ఆసక్తితో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఈ బ్యూటీ.. అందంతో పాటు టాలెంట్, పర్ఫార్మెన్స్‌తో అనేక భాషల్లో తనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. దీప్తి సతి తండ్రి మరాఠీ, తల్లి మలయాళీ కావడం వల్ల ఈమెకు ఈ రెండు భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. ముంబైలో పెరిగిన కారణంగా హిందీతో పాటు ఇంగ్లీష్‌లోనూ మంచి పట్టు తెచ్చుకుంది. సినిమాల విషయానికొస్తే తమిళం, కన్నడ భాషలను నేర్చుకోగా.. మూడేళ్ల క్రితం కథక్, భరతనాట్యంలో శిక్షణ పూర్తి చేసి అనేకసార్లు స్టేజ్ ప్రదర్శనలను చేసి ఆకట్టుకుంది. మోడల్‌గా 2012లో 'మిస్ కేరళ' అవార్డును దక్కించుకుంది. ఆ తర్వాత 'ఫెమినా మిస్ ఇండియా 2014', 'నావీ క్వీన్ 2011' వంటి పోటీల్లో పాల్గొని మెప్పించింది. ఆ తర్వాత యాడ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. 2015లో విడుదలైన నీనా అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా దీప్తి సతి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'జాగ్వార్' అనే సినిమాతో అలరించింది. ఆ తర్వాత ఆహా ఓటీటీలో విడుదలైన 'సిన్' వెబ్ సిరీస్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యింది