ఒక్కసారి పెట్టుబడితో నెలనెలా వడ్డీ వస్తుంది.. కేంద్రం హామీ.. నెలకు రూ. 9250 రావాలంటే ఇలా
Actor ProfilePolitician

ఒక్కసారి పెట్టుబడితో నెలనెలా వడ్డీ వస్తుంది.. కేంద్రం హామీ.. నెలకు రూ. 9250 రావాలంటే ఇలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒక్కసారి పెట్టుబడితో నెలనెలా వడ్డీ వస్తుంది.. కేంద్రం హామీ.. నెలకు రూ. 9250 రావాలంటే ఇలా
Samayam Telugu6 Nov 2026
ఒక్కసారి పెట్టుబడితో నెలనెలా వడ్డీ వస్తుంది.. కేంద్రం హామీ.. నెలకు రూ. 9250 రావాలంటే ఇలా

Monthly Income Scheme Returns : చాలా మంది స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు రిస్క్ అని భావించి సంప్రదాయ, సురక్షిత పెట్టుబడి సాధనాలైన పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారని చెప్పొచ్చు. ఇక్కడ దాదాపు అన్ని వర్గాల వారి కోసం పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఇక్కడ నెలనెలా వడ్డీ అందించే బెస్ట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. చాలా వరకు ఒకసారి జమ చేస్తే నిర్దిష్ట వ్యవధి తర్వాత చేతికొచ్చేవే ఉంటాయి. కానీ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్‌లో (POMIS) మీరు డబ్బులు జమ చేస్తే ప్రతి నెలా వడ్డీ అందుకోవచ్చు. ఒక్కసారి లంప్ సమ్ పెట్టుబడి పెడితే ప్రతి నెలా మీ అకౌంట్లో వడ్డీ డబ్బులు పడతాయి. ప్రస్తుతం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేటు ఇక్కడ 7.40 శాతంగా ఉంది. పెట్టుబడి విషయానికి వస్తే కనీసం రూ. 1000 తో ఇందులో చేరొచ్చు. గరిష్ఠ పెట్టుబడి విషయానికి వస్తే ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి. సింగిల్ అకౌంట్ కింద గరిష్ఠంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అదే జాయింట్ అకౌంట్‌లో అయితే గరిష్ఠంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. జాయింట్ అకౌంట్ కింద గరిష్ఠంగా ముగ్గురు ఉండొచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు కూడా అకౌంట్ తెరవొచ్చు. ఇక్కడ పెట్టుబడిపై ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో ముందుగా తీసుకోవాలనుకుంటే కాస్త పెనాల్టీ పడుతుంది. 1-3 ఏళ్ల మధ్య పెట్టుబడి డబ్బులు వెనక్కి తీసుకోవాలనుకుంటే మీ డిపాజిట్ అమౌంట్లో 2 శాతం వరకు కోత విధిస్తారు. అదే 3-5 ఏళ్ల మధ్య ఈ నిర్ణయం తీసుకుంటే ఒక శాతం కట్ అవుతుంది.Read Also: నెలకు రూ. 20 వేల SIP vs RD- ఐదేళ్లలో దేంట్లో అధిక రాబడి వస్తుంది? లెక్కలిదిగో!ఎంత జమ చేస్తే నెలకు