
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తున్నారు. ఆయన హీరోగా, దర్శకుడిగా, రైటర్‌గా, నిర్మాతగా రాణిస్తున్నారు. నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. హీరోగానే కాదు విలన్‌గానూ మెప్పిస్తున్నారు. ఆ మధ్య `సలార్`లో ప్రభాస్‌తో కలిసి నటించాడు. ఇప్పుడు మహేష్ తో `వారణాసి`లో విలన్‌గా నటిస్తున్నారు. దర్శకుడుగా `లూసీఫర్ 2`తో సంచలనాలు క్రియేట్ చేశారు. ఈ క్రమంలో మలయాళంలో ఆయన నటించిన లేటెస్ట్ మూవీ `ఐ నోబడీ`. ఈ సినిమాకి ఆయనే నిర్మాత. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ఈ4 ఎక్సపరిమెంట్స్ బ్యానర్స్ పై సుప్రియ మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సారథి నిర్మాణంలో నిసం బషీర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం మలయాళంలో గురువారమే విడుదలైంది. తెలుగులో నేడు శుక్రవారం(జులై 10) న రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియెన్స్ ని అలరించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. రాజీవ్(పృథ్వీరాజ్ సుకుమారన్) ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన భార్య మీరా(పార్వతి తిరువొతు) కూడా ప్రైవేట్ జాబ్ చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు. చాలా మధ్యతరగతి కుటుంబం. సింపుల్ గా లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. అయితే రాజీవ్ భార్య మీరాకి మరో వ్యక్తితో ఎఫైర్ ఉంటుంది. ఈ విషయం రాజీవ్‌కి తెలుస్తుంది. దీంతో అతన్ని బెదిరించడానికి బ్యాంక్‌కి వెళ్తాడు రాజీవ్. అదే సమయంలో ఆ బ్యాంక్‌లో దొంగతనం చేయడానికి ముగ్గురు దొంగలు వస్తారు. రూ.17కోట్లు దొంగిలిస్తారు. అదే సమయంలో రాజీవ్‌ని కొట్టి బంధించి తీసుకెళ్తారు. మధ్యలో అతన్ని వదిలేసి వెళ్లిపోతారు. అయితే రోడ్డు ప్రమాదంలో ఆ ముగ్గురు దొంగలు చనిపోతారు. దీంతో ఈ రాబరీలో రాజీవ్‌కి ప్రమేయం ఉందని చెప్పి పోలీసులు అతన్ని విచారిస్తుంటారు. నానా రకాలుగా వేధిస్తుంటారు. దీని కారణంగా రాజీవ్ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. మరోవైపు డబ్బు కోసం కొందరు కస్టమర్లు, జాబ్ పోయిన పోలీసులు కూడా వెతుకుతుంటారు. మరి తనకు చేయని తప్పుకి రాజీవ్