
ప్రపంచ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు సారిపాటి మరొకటి లేదు. ఐర్లాండ్ వంటి అసోసియేట్ జట్టు నుంచి ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టు వరకు ప్రతీ ఒక్క ఆటగాడు ఐపీఎల్‌లో భాగమవ్వాలని కలలు కంటుంటాడు. అందుకు తగ్గట్టే ఈ క్యాష్ రీచ్ లీగ్ ఆటగాళ్లపై కాసులు వర్షం కురిపిస్తోంది. కేవలం ప్లేయర్లకే కాదు కోచ్‌లకు కూడా కామధేనువులా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో అత్యధిక పారితోషం అందుకుంటున్న హెడ్‌కోచ్‌లపై ఓ లుకేద్దాం. క్రిక్‌బ్లాగర్ రిపోర్ట్ ప్రకారం.. ఐపీఎల్‌లో అత్యధిక వేతనం అందుకుంటున్న హెడ్‌కోచ్‌ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం, పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ (రూ. 9.5 కోట్లు), ఆశిష్ నెహ్రా(రూ. 9.5 కోట్లు) సంయుక్తంగా అగ్రస్దానంలో ఉన్నారు. నెహ్రా గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్ధానంలో సీఎస్‌కే మాజీ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్(రూ. 7.5 కోట్లు) ఉన్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2027 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు ప్రధాన కోచ్‌గా భారత లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అందుకోసం అతడికి ఢిల్లీ ఫ్రాంచైజీ రూ. 6 కోట్లు పారితోషం చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో అత్యధిక వేతనం అందుకున్న కోచ్‌ల వివరాలు: రికీ పాంటింగ్ (పంజాబ్ కింగ్స్)-రూ. 9.5 కోట్లు ఆశిష్ నెహ్రా (గుజరాత్ టైటాన్స్)-రూ. 9.5 స్టీఫెన్ ఫ్లెమింగ్(చెన్నై సూపర్ కింగ్స్)- రూ. 7.5 యువరాజ్ సింగ్(ఢిల్లీ క్యాపిటల్స్-రిపోర్ట్స్)- రూ. 6.0 కోట్లు జహీర్ ఖాన్(లక్నో సూపర్ జెయింట్స)- రూ. 5.0 కోట్లు రాహుల్ ద్రవిడ్(రాజస్తాన్ రాయల్స్)- రూ. 4.5 కోట్లు స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు) చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు) విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో