ఐటమ్ గర్ల్ స్టైల్ ను కాపీ కొట్టిన శ్రీదేవి
Actor ProfileActor

ఐటమ్ గర్ల్ స్టైల్ ను కాపీ కొట్టిన శ్రీదేవి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఐటమ్ గర్ల్ స్టైల్ ను కాపీ కొట్టిన శ్రీదేవి, స్టార్ హీరోయిన్లు కూడా ఇమిటేట్ చేసే డ్యాన్సర్, బాలయ్య
Asianet News Telugu24 Oct 2026
ఐటమ్ గర్ల్ స్టైల్ ను కాపీ కొట్టిన శ్రీదేవి, స్టార్ హీరోయిన్లు కూడా ఇమిటేట్ చేసే డ్యాన్సర్, బాలయ్య

ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ , అందం, నటన అన్నీ ఉండి.. లక్కు కలిసిరాక మరుగున పడిపోయిన వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లలో స్టార్లుగా వెలిగిన వారు కూడా వారికంటే స్టేటస్ లో తక్కువగా ఉన్న నటీమణుల స్టైల్ ను ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఇలానే ఐటమ్ సాంగ్స్ చేసుకునే ఓ హీరోయిన్ లుక్ ను, స్టైల్ ను ఫాలో అయ్యేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ వెల్లడించారు. ఆ ఐటమ్ సాంగ్స్ స్టార్ ఎవరో కాదు సిల్క్ స్మిత. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'సిల్క్ స్మిత' అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, ఒక పెద్ద సంచలనం. ఎనభై, తొంభైల కాలంలో ఆమె సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సాధారణంగా ఆమెను కేవలం ఐటమ్ సాంగ్స్, డ్యాన్సులకే పరిమితం చేసి చూసినప్పటికీ, ఆమెలో ఒక అద్భుతమైన నటి కూడా ఉంది. ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'ఆదిత్య 369' సినిమా అనుభవాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటూ.. ఈ విషయాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆదిత్య 369 సినిమాలో సిల్క్ స్మితకు ఒక ఫుల్ లెన్త్ కలిగిన నెగటివ్ షేడ్స్ ఉన్న సింహ నందిని పాత్రను ఇచ్చారు. ఆ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు భావించారు. బాలకృష్ణ మాటల్లో చెప్పాలంటే, సిల్క్ స్మిత సహజసిద్ధమైన అందం, ఆమె 'టాన్ లుక్' (మురజల్ ఫేస్), ఆమె మేకప్, కాస్ట్యూమ్స్ సెలెక్షన్ ఆ చారిత్రక కథకు ఎంతో అద్భుతమైన కాంట్రాస్ట్ తీసుకొచ్చాయి. సిల్క్ స్మిత స్టైల్ ఎంత ప్రత్యేకం అంటే.. అప్పట్లో శ్రీదేవి లాంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సైతం ఆమెను అనుకరించేవారని (ఇమిటేట్ చేసేవారని) బాలయ్య స్వయంగా వెల్లడించారు. సిల్క్ స్మిత వేసుకునే బట్టలు, ఆమె మేకప్ స్టైల్, ఆమె చీక్ హైలైట్స్

ఐటమ గర ల స ట ల న క ప క ట ట న శ ర ద వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in