ఏ సర్టిఫికెట్.. 7 నెలల ఆలస్యం..
Actor ProfileActor

ఏ సర్టిఫికెట్.. 7 నెలల ఆలస్యం..

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏ సర్టిఫికెట్.. 7 నెలల ఆలస్యం.. పైరసీ లీక్.. అయినా రూ.300 కోట్లు కొల్లగొట్టిన విజయ్
TV9 Telugu21 Nov 2026
ఏ సర్టిఫికెట్.. 7 నెలల ఆలస్యం.. పైరసీ లీక్.. అయినా రూ.300 కోట్లు కొల్లగొట్టిన విజయ్

ఎన్ని అడ్డంకులు ఎదురైనా దళపతి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తోంది ఆయన రీసెంట్ మూవీ జన నాయగన్‌. ఎన్నో కష్టాలను దాటుకుని బరిలో దిగిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. విజయ్‌ మార్కెట్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసిన ఈ సినిమాకు ఎదురైన సమస్యలేంటి..? వాటిని దాటి జన నాగయన్‌ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన జన నాయగన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా 300 కోట్ల క్లబ్‌లో చేరి ఇండస్ట్రీ జనాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఒక పక్క విజయ్ సినిమాలకు గుడ్‌ బై చెప్పేసినా... హీరోగా ఆయన క్రేజ్, బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది ఈ మూవీ. నిజానికి ఈ సినిమా థియేటర్ల వరకు రావడం అంత ఈజీగా జరగలేదు. అనుకున్న టైమ్ కంటే దాదాపు 7 నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పైగా ఈ సినిమాలోని వయోలెన్స్ కారణంగా సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం కష్టమే అని అంతా అనుకున్నారు. అదే సమయంలో విజయ్‌ ఫ్యాన్స్‌లో మేజర్‌ సెక్షన్ అయిన 18 బిలో యూత్‌ సినిమా చూసే ఛాన్స్ లేకుండా పోయింది. కానీ విజయ్ క్రేజ్ ముందు ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రిలీజ్‌కు ముందే సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ఇండస్ట్రీని షేక్ చేసింది. పైరసీ దెబ్బకు కచ్చితంగా కలెక్షన్స్ గల్లంతవ్వడం ఖాయం అని భావించారు. కానీ ఆన్‌లైన్‌లో లీకైన సినిమాను పక్కనపెట్టి, థియేటర్లలోనే తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఇన్ని నెగెటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా.. ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. కంటెంట్‌లో దమ్ముంటే, దానికి హీరో క్రేజ్ తోడైతే ఎలాంటి అడ్డంకులైనా దాటొచ్చని జన నాయగన్ మరోసారి

ఏ సర ట ఫ క ట 7 న లల ఆలస య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in