ఏ భూముల అంశం
Actor ProfilePolitician

ఏ భూముల అంశం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏ భూముల అంశంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష
Telugu Times13 Jan 2027
ఏ భూముల అంశంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేష‌న్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారుల‌తో మంగళవారం స‌మీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. ముఖ్యాంశాలు.. * రిజిస్ట్రేష‌న్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో ప‌రిశీలించి అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేష‌న్ వెంట‌నే చేస్తారు. * జిల్లా క‌లెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్నంగా ప‌రిశీలించి, శాశ్వ‌త ప‌రిష్కారానికి స‌రైన జాబితాను రూపొందిస్తారు. అందులో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూడాల‌ని ఆదేశించాను. ఈ ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించాను. * ప్రజ‌లు త‌మ భూ హ‌క్కుల విష‌యంలో ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేదు. ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంది. ప్రైవేటు భూముల‌కు సంబంధించి ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వం. * 22-ఏ భూముల విష‌యంలో ద‌ళారులు, మ‌ధ్యవ‌ర్తుల‌ను ఆశ్రయించ‌వ‌ద్దు. ఎటువంటి పుకార్లు, క‌ట్టు క‌థ‌ల‌ను విశ్వసించ‌వ‌ద్దు

ఏ భ మ ల అ శ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in