ఏ భూముల
Actor ProfilePolitician

ఏ భూముల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏ భూములపై పొంగులేటి కీలక ఆదేశాలు.. ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరిక
AP7AM3 Jan 2027
ఏ భూములపై పొంగులేటి కీలక ఆదేశాలు.. ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరిక

22ఏ నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు భూములు చేరుతున్న అంశంపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 22ఏను అడ్డుపెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని స్పష్టం చేశారు. దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.22ఏ జాబితాలో భూమి ఉందనే కారణంతోనే దరఖాస్తును తిరస్కరించవద్దని మంత్రి సూచించారు. అసలు ఆ భూమి నిషేధిత జాబితాలోకి ఎలా వచ్చిందో పరిశీలించాలని చెప్పారు. సంబంధిత రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములను కాపాడాలని సూచించారు.నిషేధిత భూముల అంశంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్‌ రిజిస్ట్రార్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులు, ఫిర్యాదులపై అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.భూ సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. 22ఏ భూముల విషయంలో నిబంధనల పేరుతో ప్రజలకు అనవసర ఇబ్బందులు కలిగించకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు