ఏళ్ల కుర్రాడికి దొరికిన రూ.98 కోట్ల లంకె బిందెలు
Actor ProfileCelebrity

ఏళ్ల కుర్రాడికి దొరికిన రూ.98 కోట్ల లంకె బిందెలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల కుర్రాడికి దొరికిన రూ.98 కోట్ల లంకె బిందెలు
Oneindia Telugu30 Dec 2026
ఏళ్ల కుర్రాడికి దొరికిన రూ.98 కోట్ల లంకె బిందెలు

సాధారణంగా ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్‌లో పనిచేసే కూలీలు, పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే కుర్రాళ్లు అనుకోకుండా డ్రైనేజీ తవ్వకాల్లో దిగితే ఏముంటుంది? మహా అయితే మట్టి, పాత ఇనుప సామాన్లు లేదా ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రమే ఎదురవుతాయి. కానీ బెల్జియం దేశంలో మాత్రం ఏకంగా లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. మురికినీటి కాలువ పనులు చేస్తుండగా ఒక 18 ఏళ్ల కుర్రాడికి ఊహించని రీతిలో కోట్లాది రూపాయల విలువైన బంగారం లభించింది. ఈ అరుదైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.కాలువ తవ్వుతుంటే బంగారం మెరిసింది!బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్‌ సమీపంలో ఉన్న సింట్‌-గిల్లిస్‌-డెండెర్‌మోండే ప్రాంతంలో ఈ విచిత్రం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో జేబు ఖర్చుల కోసం కోబ్‌ అనే 18 ఏళ్ల విద్యార్థి డ్రైనేజీ పైప్‌లైన్ల మార్పిడి పనుల్లో చేరాడు. తన తోటి కూలీలతో కలిసి మట్టి తవ్వుతుండగా ఉన్నట్టుండి భూమి అడుగున ఏదో లోహపు వస్తువు మెరుస్తూ కనిపించింది. మొదటి చూపులో అవి సాధారణ నాణేలు అనుకున్నప్పటికీ, మరింత లోతుగా తవ్వేసరికి అక్కడ ఒక పురాతన సంచి దొరికింది. దానిని తెరిచి చూడగా భారీ మొత్తంలో రాశిగా పోసిన బంగారు బిస్కట్లు, అరుదైన పురాతన నాణేలు ప్రత్యక్షమయ్యాయి.వందల ఏళ్ల నాటి బంగ్లా రహస్యం!ఈ పురాతన నిధి స్థానిక వ్యాపారవేత్త దియోఫిలస్ వాన్ అస్షే నిర్మించిన దాదాపు 19వ శతాబ్దపు బంగ్లా కింద దాగి ఉందని తేలింది. 1899 కాలంలో ప్రారంభమై 1970ల వరకు నడిచిన ఒక మద్యం తయారీ సంస్థ యజమానికి ఈ ఆస్తి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పురాతన కట్టడాన్ని ఒక సామాజిక సేవా సంస్థ ఆఫీసుల కోసం పునరుద్ధరిస్తోంది. ఈ క్రమంలోనే పాత నేలమాళిగ గోడల మధ్య శతాబ్దాలుగా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన నిధి బయటపడింది. దీని విలువ దాదాపు 9 మిలియన్ యూరోలు, అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.98 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.బయటపడ్డ 1200 ఏళ్ల