ఏళ్లలో 900 సినిమాలు.. బ్రేక్ డ్యాన్స్ తో టాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్.. ఆమె భర్త తోపు
Actor ProfileActor

ఏళ్లలో 900 సినిమాలు.. బ్రేక్ డ్యాన్స్ తో టాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్.. ఆమె భర్త తోపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్లలో 900 సినిమాలు.. బ్రేక్ డ్యాన్స్ తో టాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్.. ఆమె భర్త తోపు
TV9 Telugu13 Dec 2026
ఏళ్లలో 900 సినిమాలు.. బ్రేక్ డ్యాన్స్ తో టాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్.. ఆమె భర్త తోపు

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న డ్యాన్సర్ ఆమె. ముఖ్యంగా తన గ్లామరస్ లుక్స్, బ్రేక్ డ్యాన్స్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఆకట్టుకునే డ్యాన్స్ కదలికలతో అప్పట్లో యావత్ దక్షిణాది చిత్రసీమను ఏలింది. నటిగానే కాకుండా నెంబర్ వన్ డ్యాన్సర్ గానూ పాపులర్ అయ్యింది. ఒకప్పుడు ఆమెను డ్యాన్స్ క్వీన్ అని పిలిచుకునేవారు. మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడి మరీ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కేవలం 14 ఏళ్ల సినిమా ప్రయాణంలో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ కెరీర్ సక్సెస్ అయినప్పటికీ తన రియల్ లైఫ్ మాత్రం ఊహించినంత అందంగా సాగలేకపోయింది. మొదట కూతురిని పోగొట్టుకుంది. ఆ తర్వాత భర్తను కోల్పోయి తీవ్ర నిరాశలో కుంగిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధల నుంచి కోలుకుంటుంది. ఆమె మరెవరో కాదు.. డాన్స్ క్వీన్ డిస్కో శాంతి. డిస్కో శాంతి.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డ్యాన్సర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. అసలు పేరు శాంత కుమారి. 1965లో మద్రాసులో జన్మించారు. ప్రముఖ నటుడు సి.ఎల్ ఆనందన్ కుమార్తె. చిన్నప్పటి నుంచే నటన, డ్యాన్స్ పై ఎక్కువగా ఆసక్తి ఉండేది. 1983లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత, కేవలం 14 సంవత్సరాల కెరీర్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఒరియా భాషలలో కలిపి దాదాపు 900లకు పైగా చిత్రాల్లో నటించింది. ఆమె తెరపై కనిపించగానే ఈలలు, చప్పట్లతో థియేటర్లు మారుమోగేవి. అంతగా తన డ్యాన్స్, గ్లామర్ లుక్స్ తో వెండితెరపై మ్యాజిక్ చేసింది. [caption id="attachment_1886879" align="alignnone" width="1280"] Disco Shanti Fam[/caption] కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే 1996లో తెలుగు నటుడు శ్రీహరిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె జన్మించారు. అయితే నాలుగు నెలల వయసులోనే